https://oktelugu.com/

China : చైనా నుంచి మరో విధ్వంసం. మిస్టీరియస్ వైరస్ సంచలనం. మళ్లీ ప్రజలను భయపెడుతున్న ఈ కొత్త శాపం ఏంటి?

చైనా నుంచి వచ్చిన కరోనా..ప్రపంచంలో ఎలాంటి బీభత్సం సృష్టించిందో ఇప్పటికి చాలా మంది మర్చిపోలేదు. ఒక్క చైనాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మారణహోమం సృష్టించింది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 3, 2025 / 11:07 AM IST

    China

    Follow us on

    China : చైనా నుంచి వచ్చిన కరోనా..ప్రపంచంలో ఎలాంటి బీభత్సం సృష్టించిందో ఇప్పటికి చాలా మంది మర్చిపోలేదు. ఒక్క చైనాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మారణహోమం సృష్టించింది. చైనాలోని వుహాన్ నగరంలో కరోనా ఎలా పుట్టిందో ఇప్పటి వరకు మిస్టరీగా మిగిలిపోయింది. కరోనా విజృంభించి నేటికి ఐదేళ్లు. ఇదిలా ఉండగా చైనాలో మరో విధ్వంసం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. కరోనా తర్వాత చైనాలో మరో మిస్టరీ వైరస్ వచ్చింది. అవును, హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) వ్యాప్తి చైనాలో విస్తరిస్తోంది. దీని కారణంగా, చైనాలో మళ్లీ కరోనా లాంటి దృశ్యం కనిపిస్తుంది. ఆసుపత్రుల్లో రోగుల రద్దీ నెలకొంది. శ్మశాన వాటికలు కూడా నిండిపోయాయి.

    చైనా గురించిన ఈ నిజం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాపిస్తోంది. ఈ కొత్త వైరస్ HMPV వేగంగా వ్యాప్తి చెందుతోందని అనేక నివేదికలు, సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొంటున్నాయి. చైనాపై కన్నేసి ఉంచే కొందరు వ్యక్తులు ఇప్పుడు ఆసుపత్రులు, శ్మశానవాటికలు నిండిపోయాయని కూడా పేర్కొన్నారు. ప్రజలు వేగంగా ఈ వైరస్ బారిన పడిపోతున్నారు. ఆన్‌లైన్‌లో షేర్ చేస్తున్న వీడియోలలో ఆసుపత్రులలో ఎక్కువ జనాలు కనిపిస్తున్నారు. HMPV, ఇన్‌ఫ్లుఎంజా A, మైకోప్లాస్మా న్యుమోనియా, కోవిడ్-19 వంటి అనేక వైరస్‌లు చైనాలో ఏకకాలంలో వ్యాప్తి చెందుతున్నాయని కొందరు వినియోగదారులు చెబుతున్నారు. దీంతో చైనా ఫుల్ అలర్ట్ మోడ్‌లో ఉంది. అయినప్పటికీ, ఈ వైరస్ గురించి ఇంకా చాలా అనుమానాలు ఉన్నాయట.

    ప్రస్తుతం చైనా మానవ మెటాప్‌న్యూమోవైరస్‌తో పూర్తిగా నాశనమైందని ఓ నివేదిక పేర్కొంది. ఫ్లూ వంటి లక్షణాలు HMPVలో కనిపిస్తాయని.. దీని లక్షణాలు కూడా కోవిడ్-19 మాదిరిగానే ఉంటాయని.. ఏం జరుగుతుందో ఆరోగ్య శాఖకు అర్థం కావడం లేదని.. దీంతో ఆరోగ్యశాఖ అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని ఓనివేదిక పేర్కొంది.

    అయితే ఈ వైరస్ లక్షణాలు కూడా కరోనా మాదిరిగానే ఉంటాయి. దీని లక్షణాలు జలుబు, దగ్గును పోలి ఉంటాయి.ఇందులో జ్వరం, దగ్గు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కోవిడ్-19 వచ్చిన ఐదు సంవత్సరాల తర్వాత, చైనాలో మరో రహస్యమైన HMPV వైరస్ ప్రజలను భయపెడుతుంది. చైనాలోని అనేక ప్రాంతాల్లో హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) వ్యాప్తి పెరుగుతోంది. దీని కారణంగా అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు తరచుగా మాస్క్‌లు ధరించాలని, చేతులు శుభ్రం చేసుకోవాలని అధికారులు కోరారు.

    అయితే HMPV అంటే ఏమిటి? చైనాలో పెరుగుతున్న కేసుల గురించి ఆందోళన ఎందుకు? చైనా దానిని కరోనాలా అణిచివేస్తుందా అనే విషయాలు కూడా తెలుసుకుందాం. హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ ఒక RNA వైరస్. ఇది న్యుమోవిరిడే కుటుంబానికి చెందిన మెటాప్న్యూమోవైరస్ తరగతికి చెందినది. దీనిని మొదటిసారిగా 2001లో డచ్ పరిశోధకులు కనుగొన్నారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న పిల్లల నమూనాలను పరిశోధకులు అధ్యయనం చేసినప్పుడు ఈ వైరస్ వెల్లడైంది. ఈ వైరస్ కనీసం ఆరు దశాబ్దాలుగా ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది సాధారణ శ్వాసకోశ వ్యాధికారకంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ప్రధానంగా దగ్గు, తుమ్ముల ద్వారా ఉత్పత్తి అయ్యే బిందువుల ద్వారా వ్యాపిస్తుంది.

    ఈ వైరస్ సోకిన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు, కలుషితమైన వాతావరణాలకు గురికావడం ద్వారా కూడా ప్రసారం జరుగుతుంది. చైనీస్ CDC వెబ్‌సైట్ ప్రకారం, ఈ వైరస్ సంక్రమణ కాలం మూడు నుంచి ఐదు రోజులు ఉంటుంది. ఇది ఏడాది పొడవునా కనిపించినప్పటికీ, శీతాకాలం, వసంతకాలంలో సర్వసాధారణంగా కనిపిస్తసుందట. ఈ వైరస్ సాఫ్ట్ టార్గెట్స్ పిల్లలు, వృద్ధులు అంటున్నారు నిపుణులు. ఇక వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు మాస్క్‌లు ధరించాలని మరోసారి సూచించారు. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా మాస్క్‌లు ధరించాలని ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు. అలాగే మీ చేతులను తరచుగా శానిటైజ్ చేస్తూ ఉండండి.