https://oktelugu.com/

YS Sharmila : ఒకవైపు కుటుంబం.. మరోవైపు పార్టీ.. షర్మిల మౌనానికి అవే కారణాలు!

షర్మిల వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. కనీసం సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా లేరు. పార్టీతో పాటు కుటుంబంలో జరుగుతున్న వ్యవహారాల తోనే మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : January 3, 2025 / 11:09 AM IST

    YS Sharmila

    Follow us on

    YS Sharmila :  ఏపీలో కొత్త చర్చ నడుస్తోంది. పిసిసి చీఫ్ వైయస్ షర్మిల సైలెంట్ గా ఉండడం పై రకరకాల చర్చ ప్రారంభం అయ్యింది. గత కొద్ది రోజులుగా ఆమె చాలా సైలెంట్ గా ఉన్నారు. కనీసం సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా లేరు. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేర్పులు మార్పులు ఏమైనా ప్రారంభమయ్యాయి అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గత కొద్దిరోజులుగా ఆమెపై కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఆగ్రహంతో ఉన్నారు. ఉన్నది తక్కువ మందే అయినా.. వారు హై కమాండ్ కు ఫిర్యాదులు చేశారు. తమను పట్టించుకోవడంలేదని ఆ ఫిర్యాదు సారాంశం. పైగా అధికారంలో ఉన్న టిడిపి కూటమిని కాదని.. ఇప్పటికీ వైసీపీని టార్గెట్ చేస్తుండడాన్ని తప్పుపట్టారు. ఆమె సొంత అజెండాతో ముందుకు సాగుతున్నారన్నది కూడా ఫిర్యాదు సారాంశం. దీంతో షర్మిలను తప్పిస్తారని జోరుగా ప్రచారం నడిచింది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే షర్మిల సైలెంట్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

    * జగన్ శిబిరం వైపు తల్లి
    ఇప్పటివరకు షర్మిల వెంట ఆమె తల్లి విజయమ్మ కనిపించారు. కానీ ఉన్నట్టుండి ఆమె కుమారుడు జగన్ శిబిరం వైపు వచ్చారు. క్రిస్మస్ సమయంలో కుమారుడితో పాటు కుటుంబంతో ఆనందంగా గడిపారు. కుటుంబమంతా గ్రూప్ ఫోటో దిగి కనువిందు చేసింది. దీంతో విజయమ్మ మనసు మార్చుకున్నారని ప్రచారం జరుగుతోంది. కుమార్తె వల్ల కుమారుడికి ఎంత నష్టం జరగాలో అంతలా జరిగిందని.. ఇకనుంచి ఆ పరిస్థితి రాకూడదని ఆమె భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. కుటుంబాన్ని ఒకే తాటిపైకి తేవాలని ఆమె ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కుటుంబంతో పాటు జగన్తో విజయమ్మ గ్రూప్ ఫోటో దిగడంపై కనీసం స్పందించలేదు షర్మిల. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె ఎందుకో సరైన రీతిలో ఈ మధ్యన స్పందించడం లేదు. పెద్దగా సందడి చేయడం లేదు.

    * మార్పు ఖాయమా
    కాంగ్రెస్ హై కమాండ్ సైతం షర్మిలను మార్చేస్తుందన్న అనుమానాలు ఉన్నాయి. ఇటీవల నూతన సంవత్సర వేడుకల్లో సైతం షర్మిల పెద్దగా పాల్గొనలేదు. కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా ప్రకటనలు చేయడం లేదు. ఇంకోవైపు వైసీపీ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతోందన్న అనుమానాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఇప్పటికే పొత్తులు క్లియర్ చేసుకోవాలని జగన్ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అందుకే కాంగ్రెస్ పార్టీని జగన్ ఆశ్రయించారని.. తాను సూచించిన వ్యక్తికి కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలని కోరారని కూడా వార్తలు వస్తున్నాయి. అటు కుటుంబంలో జరుగుతున్న వ్యవహారాలు, ఇటు పార్టీ పరంగా ఎదురవుతున్న పరిణామాలతోనే షర్మిల వ్యూహాత్మకంగా సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.