https://oktelugu.com/

Arvind Kejriwal: బెయిల్ రాకముందే.. అరవింద్ కేజ్రీవాల్ కు మరో ఎదురు దెబ్బ.. లక్ష జరిమానా

తీహార్ జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపేందుకు ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు బుధవారం కొట్టేసింది. శ్రీకాంత్ ప్రసాద్ అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 8, 2024 / 04:38 PM IST

    Arvind Kejriwal

    Follow us on

    Arvind Kejriwal: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు శిక్ష అనుభవిస్తున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే ఢిల్లీ కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చే విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పైగా తీర్పును మే 9 కి రిజర్వ్ చేసింది. ఒకవేళ ఆరోజు కాకుంటే మరో వారంలో తీర్పును వెలువరించే అవకాశం ఉంది. తనను అరెస్టు చేసిన తీరును సవాల్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తా తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. “బెయిల్ ఇస్తే.. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎటువంటి అధికారాలు చేపట్టకూడదు.. ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.. మేము విధించిన నిబంధనలు అతిక్రమించి నడుచుకోకూడదని” ధర్మాసనం ప్రకటించింది. దానిని మర్చిపోకముందే బుధవారం అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు ఒక చేదు వార్త చెప్పింది.

    తీహార్ జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపేందుకు ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు బుధవారం కొట్టేసింది. శ్రీకాంత్ ప్రసాద్ అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎమ్మెల్యేలు, క్యాబినెట్ మంత్రులతో అరవింద్ కేజ్రివాల్ మాట్లాడే వీలుగా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసేలా జైళ్ల శాఖ డీజీని ఆదేశించాలని ఆయన కోరారు. శ్రీకాంత్ ప్రసాద్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం నేపథ్యంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, జస్టిస్ మన్మిత్ పిఎస్ ఆరోరా తో కూడిన ధర్మాసనం దానిని తిరస్కరించింది. శ్రీకాంత్ ప్రసాద్ కు లక్ష జరిమానా విధించింది. ఆ నగదును ఎయిమ్స్ ఆసుపత్రి ఖాతాలో జమ చేయాలని ఘాటుగా హెచ్చరించింది. పిటిషనర్ ను కోర్టు మందలించింది. విలువైన సమయం వృధా చేయకూడదని హెచ్చరించింది.

    మద్యం కుంభకోణంలో అరెస్టై అరవింద్ కేజ్రివాల్ కొద్దిరోజులుగా జైల్లో ఉంటున్నారు. అయితే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని బిజెపి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని రద్దుచేసి, రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతున్నారు. కొద్దిరోజులుగా వివిధ రూపాలలో ఆందోళనలో వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆప్ నాయకులు “జైల్ కా జవాబ్ ఓట్ సే”,” మహిళ సంవాద్” అనే కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాలలో అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.