
ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దినదినం గండంలా తయారవుతోంది. ఏరోజుకారోజు పార్టీ ఇమేజీ దిగజారుతూనే ఉంది. అందుకే.. నేతలు కూడా తమ దారులు వెతుక్కుంటూనే ఉన్నారు. ప్రధానంగా ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు తన బాధ్యతలను నిర్వర్తించడం లేదనేది తమ్ముళ్లలో కనిపిస్తున్న నైరాశ్యం.
Also Read: వైసీపీ వర్సెస్ టీడీపీ: ఏపీలో ‘బురద’ రాజకీయం!
ఇటీవల కరోనా క్రైసిస్‌లో అయితేనేమీ.. నేటి వరదల విషయంలోనే అయితేనేమీ.. లైవ్‌లోకి రాకుండా చాటుమాటు వ్యవహారం నడిపిస్తున్నారు చంద్రబాబు. కరోనా అంతటి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంటే హైదరాబాద్‌లో ఉండిపోయి జూమ్ మీటింగ్‌లు నిర్వహించడం.. ప్రభుత్వానికి లేఖలు రాయడం మినహా క్షేత్రస్థాయిలోకి వచ్చి ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వరదల నేపథ్యంలోనూ వరద బాధితులను ఆదుకోవాలంటూ హైదరాబాద్‌లోనే ఉండి ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు తప్ప.. వచ్చి బాధితులను పరామర్శించి లేదు. దీంతో పార్టీ మీద అటు ముఖ్యనేతలు, ఇటు దిగువ స్థాయి లీడర్లలోనూ అసంతృప్తి కనిపిస్తోంది.
వ్యవస్థలను మేనేజ్ చేస్తూ జగన్‌ను అన్ని విధాలా ఇబ్బందులు పెడుతున్నామని అధినాయకత్వం సంబరపడుతున్నా.. జనంలో మాత్రం టీడీపీపై నెగెటివ్ కనిపిస్తూనే ఉంది. అధికారంలో ఉన్నన్ని రోజులు ఒకలా.. అధికారం పోయాక మరొకలా వ్యవహరిస్తుండడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో మొదటి దఫాలో జగన్ ఓడిపోయినా మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు కూడా ప్రజల మధ్యే ఉన్నాడు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడారు. ప్రభుత్వాన్ని నిలదీశారు. కానీ.. చంద్రబాబు పరిస్థితి అలా లేదు. ఎప్పుడైతే ఓడిపోయారో అప్పటి నుంచే అమరావతిని వదిలి హైదరాబాద్‌లో తిష్ట వేశారు.
Also Read: జగన్‌కు కేంద్రం ఝలక్.. దిశ చట్టం అమలుకు బ్రేక్
అందుకే ఒక్కొక్కరుగా లీడర్లు సైకిల్ దిగిపోతున్నారు. ఇప్పటికే చాలావరకు క్యాడర్ వైసీపీ గూటికి చేరింది. తాజాగా.. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన అత్యంత సీనియార్ మోస్ట్ మహిళా లీడర్ ఒకరు సైకిల్ దిగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆమె రాజ్యాంగబద్ధమైన పదవిలో పనిచేసి శభాష్ అనిపించుకున్న నాయకురాలు. చంద్రబాబు కంటే కూడా సీనియర్. అన్న ఎన్టీయార్ పిలుపు మేరకు టీడీపీలోకి వచ్చిన ఆమెకు అల్లుడు గారి జమానాలో మాత్రం ఆ రకమైన మర్యాదలు పెద్దగా దక్కలేదు. నోరున్న వారికే పార్టీలో పెద్ద పీట వేయడం కూడా ఆమె లాంటి సీనియర్లకు నచ్చడంలేదని తెలుస్తోంది. ఇవన్నీ అధినాయకత్వానికి తెలిసినా కూడా పట్టించుకోకపోవడంతో ఆమె ఒక కఠిన నిర్ణయమే తీసుకుంటారని అంటున్నారు. ఆమె కనుక టీడీపీని వీడి వైసీపీలో చేరితే అది రాష్త్ర స్థాయిలోనే పెను సంచలనం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.