Siddhi Vinayaka in Mumbai: కష్టాలను తొలగించే దేవుడిగా వినాయకుడికి పేరు ఉంది. అందువల్లే ఆయనను విఘ్న అధిపతి అంటారు. వినాయకుడికి కష్టాలను తొలగించడం మాత్రమే కాదు.. వరాలు ఇవ్వడం కూడా తెలుసు. అలాంటి వరాలు ఇచ్చే గణపతుల్లో.. ఈ స్వామివారు ఫేమస్..
స్వామివారిని దర్శించుకుంటే చాలు..
ముంబైలో సిద్ధి వినాయకుడికి సంతాన ప్రదాతగా పేరుంది.. సిద్ధి వినాయకుడి ఆలయాన్ని 1801 సంవత్సరంలో నిర్మించారు. ఈ ఆలయానికి నాడు ద్యూబాయ్ పటేల్ ఆర్థిక సహకారం అందించారు.. లక్ష్మణ్ వితు పాటిల్ అనే కాంట్రాక్టర్ నిర్మాణంలో పాలుపంచుకున్నా. పాటిల్ కు సంతానం లేకపోవడంతో.. తనలాంటి బాధ ఇతర మహిళలు పడకూడదని ఈ గణపతి ఆలయాన్ని నిర్మించారు. స్వామివారి దర్శనానికి వచ్చే మహిళలకు సంతాన ప్రాప్తి కలిగించాలని ఆమె అప్పట్లో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆమె చేసిన పూజల వల్ల అనేక మంది సంతానం లేని మహిళలకు ఆ ప్రాప్తి కలిగింది..
మూషికం చెవిలో చెబితే చాలు..
సంతానం లేని మహిళలు ఈ ఆలయాన్ని ఎక్కువగా దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ కొలువై ఉన్న స్వామివారిని సవ సచ గణపతి అని పిలుస్తుంటారు. కోరిన కోరికలు తీరుస్తాడని దాని అర్థం. ఇక్కడ స్వామి వారు సిద్ధి, బుద్ధి సమేతంగా ఉంటారు. స్వామివారికి పై చేతిలో గొడ్డలి.. ఇంకొక చేతిలో తామర పువ్వు ఉంటాయి. ఇక కింది చేతుల్లో అయితే జపమాల.. లడ్డు కనిపిస్తుంటాయి. ఈ ఆలయానికి ప్రతి ఏడాది 125 కోట్ల ఆదాయం వస్తూ ఉంటుంది. బంగారం, ఇతర కార్యదైనా వస్తువులు కూడా విపరీతంగా వస్తూ ఉంటాయి. చిత్ర పరిశ్రమ చెందిన వారంతా స్వామి వారిని దర్శించుకుంటారు.. ఇక్కడ స్వామి వారు విచిత్రంగా ఉంటారు. సాధారణంగా గణపతి విగ్రహాలకు తొండం ఎడమవైపునకు తిరిగి ఉంటుంది. ఇక్కడ మాత్రం కుడివైపు ఉంటుంది. స్వామివారి విగ్రహం ఎదుట వెండితో తయారుచేసిన మూషికం ఉంటుంది. భక్తులు తమ కోరికలను ఆ మూషికం చెవిలో చెబితే తీరుతాయని నమ్మకం. గణపతి నవరాత్రి ఉత్సవాల సమయంలో ఈ ఆలయం భక్తులతో కిటికిటలాడుతూ ఉంటుంది.