Annadata Sukhibhav scheme : రైతులందరూ ప్రభుత్వ జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ప్రభుత్వం రైతులకు అందిస్తున్న అద్భుతమైన పథకం అన్నదాత సుఖీభవ పథకం. త్వరలోనే ఈ పథకం అమలు కానున్న సంగతి అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద రైతులందరికీ కూడా ఏడాదికి రూ.14వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తుంది. అర్హత ఉన్న రైతులందరి బ్యాంకు ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులను ప్రభుత్వం జమ చేస్తుంది. కానీ ప్రస్తుతం రైతులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే. అర్హులైన వారిని గుర్తించేందుకు ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రభుత్వం సర్వే మొదలు పెట్టింది. ఒక జాబితాలో అర్హుల పేర్లను రూపొందించారు. ఈ జాబితాలో మీ పేరు ఉంటే పర్వాలేదు మీకు డబ్బులు గ్యారెంటీగా వస్తాయి. ఒకవేళ ఈ ప్రభుత్వ జాబితాలో మీ పేరు లేకపోతే మీకు డబ్బులు రావు.
రైతులందరూ కూడా తమ పొలానికి సంబంధించిన పట్టా బుక్ అలాగే ఆధార్ కార్డు రెండిటిని తీసుకొని సమీపంలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్లాల్సిందిగా ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు. రైతు భరోసా కేంద్రంలో ఉన్న అధికారిని రైతులందరూ సంప్రదించి అన్నదాత సుఖీభవ డబ్బులు తమకు వస్తాయా, రావా అని విషయాన్ని తెలుసుకోవాలి. ఒకవేళ వాళ్ల పేరు ఈ జాబితాలో లేకపోతే ఆ తర్వాత ఏం చేయాలో కూడా అక్కడి అధికారులు వివరిస్తారు. కాబట్టి వెంటనే రైతులందరూ ఆలస్యం చేయకుండా తమకు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్లి చెక్ చేసుకోండి.
Also Read : అన్నదాత సుఖీభవ.. అర్హతలివే.. మార్గదర్శకాలు జారీ!
దీనికి సంబంధించి తాజాగా కడప జిల్లా తొలివేములలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి సంబంధించిన అధికారి తిరుమలేష్ మాట్లాడుతూ రైతులందరూ కూడా తమ పొలానికి సంబంధించిన రైతు పట్టా బుక్ తో పాటు ఆధార్ కార్డును కూడా తీసుకొని రైతు భరోసా సెంటర్ కు వెళ్లి అక్కడ పూర్తి వివరాలను చెక్ చేసుకోవాల్సిందిగా తెలిపారు. ఒకవేళ ఆ జాబితాలో మీ పేరు లేకపోతే కనుక ఎక్కడ పొరపాటు జరిగిందో అధికారులు వివరిస్తారు. ఆ తర్వాత ఏం చేయాలో కూడా వాళ్లే చెప్తారు. కాబట్టి వెంటనే రైతులు రైతు భరోసా కేంద్రానికి వెళ్లి అన్నదాత సుఖీభవ పథకం లిస్టులో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవడం మంచిది.