Good news AP centre funds : ఏపీ ప్రభుత్వానికి( AP government) కేంద్రం శుభవార్త చెప్పింది. ఉపాధి హామీ పథకానికి గాను రూ.1136 కోట్లు విడుదల చేసింది. పాత బకాయిలను సైతం చెల్లించాలని ఆదేశించింది. రెండు రోజుల కిందట 1000 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఉపాధి హామీ వేతనదారులకు ఇబ్బందులు తీరనున్నాయి. గత కొద్ది రోజులుగా వేతన చెల్లింపులు నిలిచిపోవడంతో శ్రమజీవులకు ఎదురుచూపులు తప్పలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం విన్నపం మేరకు వరుసగా ఉపాధి హామీ నిధులను కేంద్రం విడుదల చేయడం విశేషం. ఏపీ పట్ల కేంద్రం మరోసారి తన ఉదాహరణ చాటుకున్నట్లు అయ్యింది.
* వేతన దారుల బిల్లుల చెల్లింపు..
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ పథకానికి గాను ఏపీకి భారీగా నిధులు విడుదల చేసింది. మొత్తం రూ.1136 కోట్లు విడుదల చేయగా.. అందులో మెటీరియల్ కాంపోనెంట్( material component) నిధులు రూ.960.15 కోట్లు ఉన్నాయి. దీనికి తోడు పరిపాలన ఖర్చులకోసం రూ. 176.15 కోట్లు విడుదల చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా విడుదల చేసిన నిధుల్లో పాత పెండింగ్ బిల్లులను చెల్లించాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. రెండు రోజుల కిందటే 1029 కోట్ల రూపాయల ఉపాధి నిధులు మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. వరుసగా ఏపీకి నిధులు కేటాయింపు పై హర్షం వ్యక్తం అవుతోంది. ఈ డబ్బులు వేతనదారుల బ్యాంక్ అకౌంట్లో రెండు మూడు రోజుల్లో జమ కానున్నాయి. ఈ ఏడాది మే నుంచి ఉపాధి వేతన దారుల చెల్లింపులు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ నిధులను విడుదల చేసింది.
* వ్యవసాయంతో అనుసంధానం..
ఉపాధి హామీ పథకం విషయంలో కేంద్రం మరింత చొరవతో ముందుకు సాగుతోంది. వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానం చేసిన సంగతి తెలిసిందే. ఉపాధి హామీ పథకంతో వ్యవసాయ పనులకు మనుషులు దొరకని పరిస్థితి. అందుకే వేతన జీవులకు ఉపాధి కల్పించడంతో పాటు రైతులకు సాగు ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ అనుసంధానించారు. ఇప్పటికే ఉపాధి హామీ ద్వారా వ్యవసాయ శాఖకు సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఎండల దృష్ట్యా ఉదయం వేగంగా ఉపాధి పనులు ప్రారంభిస్తున్నారు. సాయంత్రం ఎండధాటి తగ్గిన తరువాత పనులు ప్రారంభించి 6 గంటల వరకు కొనసాగిస్తున్నారు. మొత్తానికి అయితే ఏపీలో వేతన దారులకు పెండింగ్ బిల్లులు చెల్లించని ఉండడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.