Homeఆంధ్రప్రదేశ్‌Viral Video: పూట పనికి రూ.26వేల జీతాలా అక్కా.. మరీ ఇంత కోరికా?

Viral Video: పూట పనికి రూ.26వేల జీతాలా అక్కా.. మరీ ఇంత కోరికా?

Viral Video: పనికి తగ్గట్టు వేతనం లభించాలంటే మన దేశంలో కుదరదు. ఫర్ సపోజ్ అమెరికాలో గంటల లెక్కనే చెల్లింపులుంటాయి. అందుకే మనవాళ్లు ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లి అక్కడే స్థిరపడిపోతున్నారు. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే వెట్టి చాకిరీ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. పనిచేయకుండా వెనుక వేసుకునేవారు వేసుకుంటూనే ఉన్నారు. సో ఇక్కడ శ్రమ దోపిడీ అనేది నిరంతర ప్రక్రియ. ప్రభుత్వ పరిధిలో ఇలా ఉంటే ఎవరైనా ప్రశ్నిస్తారు. అదే ప్రైవేట్ లో ప్రశ్నిస్తే ఉద్యోగాలు తొలగించి బయటికి పంపిస్తారు. ప్రభుత్వంలో సవాలక్ష నిబంధనలు ఉంటాయి కాబట్టి బయటికి పంపించడం అంత సులువు కాదు. అయితే ప్రభుత్వం నుంచి హామీలు పొందాలి అంటే శ్రమ దోపిడీకి గురవుతున్న వారు లేదా శ్రమకు తగ్గట్టు వేతనం లభించని వారు నిరసనలు చేపట్టాలి. ప్రస్తుతం ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలు అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నది అదే. వీరి ఆందోళనలకు అక్కడి ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి తెలుపుతున్నాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి అంగన్వాడి కార్యకర్తల ఆందోళనలకు విశేషమైన కవరేజ్ ఇస్తున్నాయి. అయితే ఎన్నికల సమయంలో ఇటువంటి ఆందోళనలు అధికార పార్టీకి ఇబ్బంది కలిగిస్తాయి కాబట్టి.. వైసిపికి మద్దతుగా రాంగోపాల్ వర్మ రంగంలోకి దిగారు.. ఇందుకు ఆయన ట్విట్టర్ ను ఆయుధంగా వాడుకుంటున్నారు.

తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో కొంతమంది మహిళలు అంటే వారంతా అంగన్వాడీ కార్యకర్తలు వేప కొమ్మలు చేతిలో పట్టుకుని అమ్మవారు పూనిన మహిళను తమ కోరికలు తీర్చాలని ప్రాధేయపడుతున్నారు. తమ వేతనాన్ని 26 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా చేయమని వేడుకుంటున్నారు. అయితే ఈ వీడియోను రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతా లో పోస్ట్ చేశారు. ఇదే సమయంలో అంగన్వాడి కార్యకర్తలని విమర్శించడం మొదలుపెట్టారు. గత ప్రభుత్వంలో ఎంత వేతనం ఇచ్చారని, జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత ఇస్తున్నారని ప్రశ్నించారు. అంతేకాదు లెక్కలతో సహా అంగన్వాడి కార్యకర్తలకు ప్రభుత్వం నుంచి ఎంత ప్రయోజనం వస్తుందో వివరించే ప్రయత్నం చేశారు. అయితే రాంగోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది.

సహజంగా రాంగోపాల్ ఏదైనా ట్వీట్ చేస్తే రెచ్చిపోయే టిడిపి నాయకులు.. ఈసారి మాత్రం సైలెంట్ అయిపోయారు. ఇదే సమయంలో వైసీపీ నాయకులు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ను తెగ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంగన్వాడి కార్యకర్తలను గుర్రాలతో తొక్కించిన సంఘటనను గుర్తు చేస్తున్నారు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంగన్వాడి కార్యకర్తలకు ఏ స్థాయిలో ప్రయోజనాలు అందాయో లెక్కలతో సహా వివరిస్తున్నారు. ఇలా చేసే అంత మాత్రం పనికి 26వేల వేతనం డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని విమర్శిస్తున్నారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి చెందిన వచ్చిన తర్వాత వాలంటీర్ల ద్వారా అన్ని ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారుల చెంతకు చేర్చుతోందని.. అలాంటప్పుడు అంగన్వాడి కార్యకర్తల మీద పడే భారమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షాల ట్రాప్ లో పడి నిరసనలు చేస్తే తర్వాత ఇబ్బంది పడేది మీరే అని వారికి హితబోధ చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version