https://oktelugu.com/

Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్ కి భారీ షాక్… కేసు నమోదు చేసిన పోలీసులు!

ఈ దాడులను సుమోటోగా స్వీకరించిన పోలీసులు పల్లవి ప్రశాంత్ తో పాటు అతని అభిమానుల పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Written By:
  • NARESH
  • , Updated On : December 18, 2023 / 07:05 PM IST
    Follow us on

    Pallavi Prashanth : బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. దీంతో అతని అభిమానులు నిన్న అర్ధ రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు భారీ ఎత్తున చేరుకున్న అభిమానులు నినాదాలు చేశారు. ఇతర కంటెస్టెంట్స్ పై వీరు దాడి చేయడం సంచలనంగా మారింది. రన్నర్ గా నిలిచిన అమర్ దీప్ .. తన తల్లి, భార్యతో కారులో ఇంటికి వెళ్తుంటే స్టూడియో బయట ప్రశాంత్ అభిమానులు దాడి చేశారు. కారు వెనుక అద్దాలు పగలగొట్టారు. కారును చుట్టుముట్టి గొడవ చేశారు.

    మరోవైపు, అక్కడ ఉన్న ఆర్టీసీ బస్సు అద్దాలు కూడా పగలగొట్టారు. ఇక వారిని కంట్రోల్ చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు. లాఠీలు చేత పట్టి పరుగులు పెట్టించారు. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కార్లపై జరిగిన దాడులకు పోలీసులు సీరియస్ అయ్యారు. అమర్ దీప్, అశ్విని, గీతూ రాయల్ కార్ల అద్దాలు పగలగొట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్ వైపుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సులపై సైతం ఫ్యాన్స్ దాడులకు పాల్పడ్డారు.

    ఈ దాడులను సుమోటోగా స్వీకరించిన పోలీసులు పల్లవి ప్రశాంత్ తో పాటు అతని అభిమానుల పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే బిగ్ బాస్ బజ్ లో ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ఇంటర్వూలు తీసుకుంటున్న గీతూ రాయల్ కార్ ని పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ధ్వంసం చేశారు. దీంతో గీతూ .. పోలీస్ కేసు పెట్టింది.

    ఇది చాలదు అన్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ బయట పల్లవి ప్రశాంత్ ఫాన్స్ , అమర్ దీప్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. ఈ క్రమంలోనే 6 ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఇది ఇలా ఉండగా .. ప్రశాంత్ స్టూడియోస్ నుంచి బయటకు వచ్చి నపుడు భద్రతా కారణాల రీత్యా పోలీసులు అతడిని కారు నుంచి బయటకు రానివ్వలేదు. దీంతో ప్రశాంత్ ‘ రైతు బిడ్డ కు విలువ ఇస్తలేదు అంటూ తల బాదుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.