Salaar Trailer Highlights: ప్రభాస్ హీరోగా ఈనెల 22వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతున్న సలార్ సినిమా మీద రోజు రోజుకి భారీ అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన మొదటి ట్రైలర్ డివైడ్ తెచ్చుకున్నప్పటికీ, ఫస్ట్ సింగిల్ గా వచ్చిన సాంగ్ మాత్రం ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుంది. ఇక దానికి తోడుగా ఇప్పుడు సెకండ్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ కనిపించింది తక్కువ సేపు అయినప్పటికీ బాగా ఆకట్టుకునే విధంగా భారీ డైలాగులు చెబుతూ యాక్షన్ ఎపిసోడ్స్ లో పాల్గొంటూ ప్రతి ప్రేక్షకుడికి కిక్కిచ్చే విధంగా ఎంటైర్ ట్రైలర్ ని రన్ చేశాడు ప్రశాంత్ నీల్…
ఇక ప్రతి వర్గం ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకొని ట్రైలర్ ని డిజైన్ చేశాడు అయితే ఈ సినిమాలో ఉన్న మెయిన్ స్టోరీ ని ట్రైలర్ లోనే రివిల్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ట్రైలర్ యొక్క ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ఇక ఈ ట్రైలర్ లో ప్లస్ పెయింట్స్ ఏంటంటే…
ఈ సినిమాలో ప్రభాస్ ( దేవా) ఎవరైతే తన ప్రాణానికి ప్రాణం అనుకుంటున్నాడో ఆ వ్యక్తి అతని యొక్క అవసరాలు తీర్చుకోవడానికి వాడుకునే వ్యక్తి గా మాత్రమే పృథ్వి రాజ్ సుకుమారన్ క్యారెక్టర్ ని క్లియర్ గా ట్రైలర్ లో మెన్షన్ చేశారు. అయితే ఇప్పుడు ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య జరిగే ఒక కథ గా ఇది మనకు అర్థం అయిపోతుంది. ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ కొన్ని షాట్స్ లో మాత్రం అద్భుతంగా ఉన్నాయి అలాగే పృథ్విరాజ్ సుకుమారన్ కూడా తనదైన రీతిలో ప్రభాస్ తో పాటుగా చాలా ఎక్కువ సేపు స్క్రీన్ స్పేస్ ని సంపాదించుకున్నట్టు గా తెలుస్తుంది.
ప్రశాంత్ నీల్ ఈ సినిమా మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేసినట్టుగా కనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో ఎలివేషన్స్ కే జి ఎఫ్ లెవల్లో ఇచ్చారు.మొదట్లో చిన్న బాలుడు జాంబి లతో ఫైట్ చేసే ఆ ట్రాక్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచే విధంగా కనిపిస్తుంది. అలాగే పృధ్విరాజ్ సుకుమారన్ కోసం ప్రభాస్ చేసే ఫైట్స్ గాని ప్రతి ఎలివేషన్ గానీ భారీ లెవెల్ లో పండినట్టుగా కనిపిస్తుంది…
ఇక ఈ ట్రైలర్ లో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటంటే…
ట్రైలర్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేసిన ప్రశాంత్ నీల్…ఒకనొక టైం లో ట్రైలర్ అంత గందరగోళంతో ఉన్నట్టు గా కూడా అనిపిస్తుంది.ఇక ఈ సినిమా మొత్తాన్ని అదే ట్రాక్ లో తీసుకెళ్లినట్టుగా కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా మనకైతే కనిపించడం లేదు అలాగే ప్రభాస్ క్యారెక్టర్ లో కూడా వేరియేషన్స్ అయితే ఉన్నాయి. కానీ వాటిని ప్రశాంత్ నీల్ కరెక్ట్ గా వాడుకొని వాటిని డీల్ చేసినట్టుగా అయితే కనిపించడం లేదు.ఇక ట్రైలర్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఆద్యంతం బాగున్నట్టు కనిపించినప్పటికీ దాంట్లో వచ్చే కోర్ ఎమోషన్ మాత్రం మిస్ మ్యాచ్ గా అయినట్టు గా అర్థమవుతుంది…
అలాగే కే జి ఎఫ్ లో ఎలాగైతే తల్లి సెంటిమెంట్ ని హెవీగా వర్కౌట్ చేశారో ఈ సినిమాలో ఫ్రెండ్స్ మధ్య ఉన్న ఆ ఎమోషన్ ని, ఎలివేషన్ ని అంత సక్సెస్ ఫుల్ గా డీల్ చేయలేకపోయారు అనేది క్లారిటీగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య వచ్చిన ఎలివేషన్ ని భారీ లెవెల్ లో చూపించలేకపోయాడు అన్నట్టుగా ట్రైలర్ లో అయితే క్లియర్ గా అర్థం అవుతుంది…ఫ్రెండ్స్ కి తగ్గ ఎమోషన్, ఎలివేషన్స్ లో రాజమౌళి ప్రభాస్ తో చేసిన ఛత్రపతి సినిమాలో ప్రభాస్ కి, శేఖర్ కి మధ్య ఉన్న ఆ ఇంటిమసి సలార్ లో మిస్సయింది…
ఇక ట్రైలర్ లో వచ్చిన మ్యూజిక్ కూడా పెద్దగా ఇంప్రెస్ అయితే చేయలేకపోయింది అలాగే శృతిహాసన్ ఒకటి రెండు షాట్లకి పరిమితమైనప్పటికీ తన క్యారెక్టర్ కూడా ఇందులో పెద్దగా ఏమీ లేదు అన్నట్టుగానే తెలుస్తుంది.
ఇక సలార్ సినిమా మొత్తాన్ని ఇద్దరు ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ని డిజైన్ చేసుకొని ఇక మిగితా దంత యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేసినట్టు గా తెలుస్తుంది. కే జి ఎఫ్ 2 లాగే ఈ సినిమాని కూడా యాక్షన్ ఎపిసోడ్స్ తో సక్సెస్ చేయాలని ప్రశాంత్ నీల్ అనుకున్నట్టుగా తెలుస్తుంది కానీ అన్ని సినిమాలకు అది వర్కౌట్ అయ్యే ఫార్ములా అయితే కాదు. ఒక కోర్ ఎమోషన్ ని సలార్ మిస్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. కేజిఎఫ్ సినిమా అంత పెద్ద హిట్ అవడానికి మెయిన్ కారణం అమ్మ మీద ఉన్న ఒక కోర్ ఎమోషన్ మరి దీంట్లో ఏ ఎమోషన్ ని పట్టుకొని ప్రశాంత్ నీల్ సినిమా ని ముందుకు తీసుకెళ్తున్నాడో మనకైతే తెలియట్లేదు. హీరో క్యారెక్టర్జేషన్ లో కూడా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. తను ఎవరి కోసం యుద్ధం చేస్తున్నాడు తను ఎందుకు యుద్ధం చేస్తున్నాడు అనేది తెలియకుండా బ్లైండ్ గా యుద్ధం చేసే క్యారెక్టర్ లో ప్రభాస్ ని చూపించినట్టుగా క్లియర్ గా తెలుస్తుంది…ఇక సినిమాలో ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించే విధంగా లేవు…
ప్రశాంత్ నీల్ మార్క్ అయితే ఈ సినిమాలో ఉంది కానీ అది ఈ సినిమా లో పెద్దగా వర్కౌట్ అయ్యే విధంగా అయితే కనిపించడం లేదు…
ఇక డిసెంబర్ 22 వ తేదీన సలార్ మూవీ పరిస్థితి ఎంటి అనేది తెలుస్తుంది…