
Andhra Pradesh: దేశవ్యాప్తంగా మెట్రో రైళ్ల విస్తరణ కొనసాగుతోంది. హైదరాబాద్ తో పాటు పలు స్టేట్లు మెట్రో రైళ్లను ప్రవేశపెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఈశాన్యం, కేంద్ర పాలిత ప్రాంతాలు మినహా దేశంలోని ప్రధాన నగరాల్లో మెట్రో రైళ్ల నెట్ వర్క్ ను విస్తరిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం నజఫ్ గడ్ నుంచి దౌసా బస్టాండ్ వరకు నిర్మించిన మెట్రో రైల్వే ప్రాజెక్టు ఇవ్వాళ నుంచే అందుబాటులోకి వచ్చింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ దీన్ని ప్రారంభించారు.
వచ్చే సంవత్సరం 2022 ఆర్థిక సంవత్సరానికి కొత్తగా 900 కిలోమీటర్ల మెట్రో రైల్ ప్రాజెక్టును పలు స్టేట్లకు మంజూరు చేసినట్లు హర్దీప్ సింగ్ పురే పేర్కొన్నారు. 740 కిలోమీటర్లకు సంబంధించిన మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. మెట్రో రైళ్లతో ప్రయాణికులకు దూరం తగ్గే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ లో నిర్మించిన మెట్రోతో ప్రయాణికులకు సౌకర్యంగా మారింది. దీంతో అన్ని ప్రాంతాల్లో కూడా మెట్రో రైళ్ల కోసం కసరత్తు చేస్తున్నారు.
మెట్రో రైలు ప్రాజెక్టులతో ప్రజలు మరింత సదుపాయాలు కలగనున్నాయి. ప్రజల సౌకర్యార్థం మెట్రో రైళ్లు పెంచాల్సిన అవసరం ఉందని గుర్తిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో మెట్రో రైళ్ల ప్రాజెక్టుల ప్రస్తావన తెస్తోంది. దూరం తగ్గి ప్రయాణ చార్జీల భారం కూడా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.
పెరుగుతున్న నగరాల జనాభాకనుగుణంగా సదుపాయాలు కల్పించాల్సిన అవసరం కూడా ఉంది.
దీంతోనే మెట్రో నగరాల్లో ప్రధానమైన రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేయాల్సిన పనికి సంకల్పించింది. రాకపోకలు సాగించడానికి మెట్రో రైళ్లను అందుబాటులోకి తెస్తోంది. దక్షిణాది స్టేట్ల రాజధానులైన బెంగుళూరు, హైదరాబాద్, తిరువనంతపురం తదితర ప్రాంతాల్లో మెట్రో రైళ్ల పరుగులు చూస్తూనే ఉన్నాం. ఒక్క ఏపీలోనే మెట్రో రైళ్లు లేవు. దీంతో అక్కడ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.