
Bandi Sanjay: నేను చేసేది రాజకీయ యాత్ర కాదు.. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు చేపట్టిన యాత్ర ఇది అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేసీ ఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు. లింగంపేట మండలంలోని పేదవాళ్లకు పాత తోక పాసు పుస్తకాలకు కొత్త పాస్ బుక్కులు రావాలంటే ఇక్కడ ఉప ఎన్నికలు రావాలని బండి చెప్పుకొచ్చారు. పోడు భూముల సమస్యలకు పరిష్కారం వెంటనే కేసీఆర్ చూపాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలకు పేర్లు మార్చి తన పథకాలుగా ప్రచారం చేసుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వం అని బండి సంజయ్ విమర్శించారు. టీఆర్ఎస్ మేము ఎప్పుడు కలిసి పోటీ చేయలేదు.. టీడీపీ, కాంగ్రేస్, కమ్యునిస్టు పార్టీలు టీఆర్ఎస్ కలిసి పోటీ చేశాయని బండి విమర్శించారు. పేదలకు న్యాయం జరగాలంటే బీజేపీ రాష్ర్టంలో 2023లో అధికారంలోకి రావాలి..
ముఖ్యమంత్రి కుటుంబం కోసమా మన యువకులు బలిదానాలు చేశారని బండి సంజయ్ విమర్శించారు. కుటుంబ పాలనకు చరమ గీతం పాడాలంటే బలిదానం చేసిన యువకుల కుటుంబాల గూర్చి ప్రజలు ఆలోచించాలని అన్నారు. నాటి నిజమైన ఉద్యమ కారులను పక్కన పెట్టి ఉద్యమ ద్రోహులను గద్దెపై కూర్చోబెట్టిన చరిత్ర కేసీఆర్ ది కాదా అని ప్రశ్నించారు. ప్రజలను కులాలను, సంఘాల పేరుతో చీలుస్తున్న చరిత్ర కేసీఆర్ ది మాది కాదని విమర్శించారు. ముస్లిం మహిళల కోసం ట్రిపుల్ తలాక్ ను వ్యతిరేకిస్తున్నావా.. లేదా అనేది కేసీ ఆర్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
బండి సంజయ్ ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం లింగపేట మండలంలో కొనసాగుతోంది. బండి పాదయాత్రకు ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోంది. అడుగడుగునా ప్రజలు స్వాగతం పలుకుతున్నారు.