https://oktelugu.com/

ఏపీలో మండే ఎండలు.. విలవిలలాడుతున్న …

లాక్ డౌన్ నుంచి గ్రీన్, ఆరంజ్ జోన్ ప్రజలకు కేంద్రం వెసులుబాటు ఇచ్చినా ఎపి ప్రజలు లాక్ డౌన్ పాటించక తప్పడం లేదు. ఇందుకు కారణం రెండు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరగడమే. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో 43 నుంచి 47.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరోవైపు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరికలు […]

Written By: , Updated On : May 21, 2020 / 03:30 PM IST
Follow us on


లాక్ డౌన్ నుంచి గ్రీన్, ఆరంజ్ జోన్ ప్రజలకు కేంద్రం వెసులుబాటు ఇచ్చినా ఎపి ప్రజలు లాక్ డౌన్ పాటించక తప్పడం లేదు. ఇందుకు కారణం రెండు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరగడమే. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో 43 నుంచి 47.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరోవైపు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 24 వరకు రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, వడగాల్పుల ముప్పు కూడా ఉందని పేర్కొంది. రాయలసీమ, కోస్తాంధ్రలో ఎండలు తారస్థాయికి చేరుకుంటాయని వెల్లడించింది. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే గుంటూరు జిల్లా రెంటచింతలలో నిన్న ఏకంగా 47.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న రాష్ట్రంలోని పలు చోట్ల 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా జంగమేశ్వరపురంలో 44, విజయవాడలో 43.5, మచిలీపట్నంలో 43.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఐఎండీ అమరావతి డైరెక్టర్‌ స్టెల్లా వెల్లడించారు.

ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ, యానాంలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఆదివారం వరకూ నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. ముఖ్యంగా పిల్లలు, పెద్దలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. అంఫాన్ తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై ఉండి వర్షాలు కురుస్తాయని ఆశించిన రాష్ట్ర ప్రజానీకానికి నిరాశే మిగిలింది. వార్షాలు పడకపోగా ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి.