షూటింగ్ సడలింపులపై తుది నిర్ణయం కేసీఆర్ దే

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సీనిపెద్దలు సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ తో గురువారం ఉదయం బేటీ అయ్యారు. ఇందులో సినిమా షూటింగుల ప్రారంభం, సినీ కార్మికుల సమస్యలు, థియేటర్లు ఎప్పుడు తెరుస్తారు? వంటి అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పలువురు సీని పెద్దలు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్మకాలను పాటిస్తూ షూటింగులు చేసేందుకు తాము సిద్ధమేనంటూ ప్రకటించారు. ఇప్పటికే లాక్డౌన్లో అన్నిరంగాలకు సడలింపులు ఇచ్చారని తమ ఇండస్ట్రీని నమ్ముకొని వేలాది మంది కార్మికులు జీవనం […]

Written By: Neelambaram, Updated On : May 21, 2020 6:55 pm
Follow us on


మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సీనిపెద్దలు సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ తో గురువారం ఉదయం బేటీ అయ్యారు. ఇందులో సినిమా షూటింగుల ప్రారంభం, సినీ కార్మికుల సమస్యలు, థియేటర్లు ఎప్పుడు తెరుస్తారు? వంటి అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పలువురు సీని పెద్దలు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్మకాలను పాటిస్తూ షూటింగులు చేసేందుకు తాము సిద్ధమేనంటూ ప్రకటించారు. ఇప్పటికే లాక్డౌన్లో అన్నిరంగాలకు సడలింపులు ఇచ్చారని తమ ఇండస్ట్రీని నమ్ముకొని వేలాది మంది కార్మికులు జీవనం సాగిస్తున్నారని వివరించారు. షూటింగులు ప్రారంభించకపోతే ఇండస్ట్రీని నమ్ముకొని జీవిస్తున్న వేలాది మంది కార్మికులు రోడ్డున పడాల్సి వస్తుందని ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి షూటింగులకు అనుమతి ఇవ్వాలని కోరారు. సినీ రంగానికి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాలని వారు కోరారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం సినిమా రంగానికి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంటుందని తెలిపారు. సినిమాకు సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ పనులు చేసుకోవచ్చని తెలిపారు. దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని ఆయన అన్నారు. సీనిరంగంలోని కార్మికుల గురించి ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు. కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ సమావేశంలో చర్చించిన విషయాలపై ఒకట్రెండు రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి తలసాని తెలిపారు. షూటింగులకు అనుమతిచ్చేది మాత్రం ముఖ్యమంత్రి కేసీఆరేనని చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగానే ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ బేటీలో మెగాస్టార్ చిరంజీవితోపాటు అక్కినేని నాగార్జున, నిర్మాతలు అల్లు అరవింద్‌, దిల్‌రాజు, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, సి.కల్యాణ్‌, జెమిని కిరణ్, స్రవంతి రవికిషోర్‌, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, వినాయక్‌, త్రివిక్రమ్‌ తదితరులు పాల్గొన్నారు.‌ అన్ని అనుకున్నట్లు జరిగితే జూన్లో సినిమా షూటింగులు ప్రారంభం కావడం కన్పిస్తుంది. అయితే దీనిపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.