Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో జనాభా తగ్గుతోందా?

Andhra Pradesh: దేశంలో జనాభా తగ్గిపోతోంది. మేమిద్దరం మాకిద్దరు అనే నినాదంతో ప్రభుత్వాలు ప్రజలను చైతన్యవంతులను చేయడంతో జనాభా విపరీతంగా వెనుకబడిపోతోంది. ఫలితంగా భవిష్యత్ తరాలకు కష్టంగా మారనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మేమిద్దరం మాకొ్క్కరు అంటూ జనాభా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు. ఫలితంగా రోజురోజుకు జనాభా వృద్ధి రేటు క్రమంగా తగ్గుతోంది. దీంతో ప్రస్తుతం ప్రమాకర స్థాయికి చేరింది. దీనిపై ఆందోళనలు పెరుుతున్నాయి. ఇప్పుడు జనాభా తగ్గిపోతే దాన్ని పెంచే మార్గాలేంటనే ప్రశ్నలు వస్తున్నాయి. రాబోయే […]

Written By: Srinivas, Updated On : May 13, 2022 12:56 pm
Follow us on

Andhra Pradesh: దేశంలో జనాభా తగ్గిపోతోంది. మేమిద్దరం మాకిద్దరు అనే నినాదంతో ప్రభుత్వాలు ప్రజలను చైతన్యవంతులను చేయడంతో జనాభా విపరీతంగా వెనుకబడిపోతోంది. ఫలితంగా భవిష్యత్ తరాలకు కష్టంగా మారనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మేమిద్దరం మాకొ్క్కరు అంటూ జనాభా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు. ఫలితంగా రోజురోజుకు జనాభా వృద్ధి రేటు క్రమంగా తగ్గుతోంది. దీంతో ప్రస్తుతం ప్రమాకర స్థాయికి చేరింది. దీనిపై ఆందోళనలు పెరుుతున్నాయి. ఇప్పుడు జనాభా తగ్గిపోతే దాన్ని పెంచే మార్గాలేంటనే ప్రశ్నలు వస్తున్నాయి. రాబోయే తరాలకు జనాభా పెద్ద గుదిబండగా మారనుందని తెలుస్తోంది.

Andhra Pradesh Population

దేశంలోని రాష్ట్రాల్లో ఏపీలో జనాభా వృద్ధి రేటు ఆందోళన కరంగా ఉంటోంది. దీనిపై ఇప్పడే చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ లో ఇబ్బందులే ఏర్పడనున్నాయి. జనాభా పెరుగుదలతో వచ్చే నష్టాలను వివరిస్తూ ప్రభుత్వాలు ప్రజలను చైతన్యవంతులను చేయడంతో ఇక జనాభా నియంత్రణ పద్ధతులు కఠినంగా పాటించారు. దీంతో జనాభా వృద్ధి రేటు క్రమంగా తగ్గుతూ వచ్చింది. అది కాస్త ప్రమాదకరస్థాయిలో ఉండటంతో ఏం చేయాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు.

Also Read: Acharya: 12 డేస్ కలెక్షన్స్.. మెగాస్టార్ కి ఎన్ని కోట్లు నష్టం అంటే ?

చైనాలో కూడా జనాభా వృద్ధి రేటు తగ్గడంతో అక్కడ కూడా దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. మేమిద్దరం మాకొక్కరు అనే నినాదాన్ని పక్కన పెట్టారు. జనాభా నియంత్రణ చర్యలు అవసరం లేదని చెబుతున్నారు. రాబోయే కాలంలో జనాభా పెంచుకోవడంపై దృష్టి సారించారు ఇందుకోసం పలు చర్యలు తీసుకుంటోంది. మన దేశం కూడా జనాభా నియంత్రణ చర్యలు పక్కన పెట్టి మళ్లీ జనాభా వృద్ధికి పాటుపడాల్సిన అవసరం ఉందని తెలుసుకుంటే మంచిదనే అభిప్రాయాలు వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో అన్ని రాష్ట్రాలకంటే వృద్ధి రేటు చాలా తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అందుకే అక్కడ జనాభా పెరుగుదల కోసం ఇప్పుడే మేల్కోవాల్సిన అవసరం ఉందని గుర్తించాలి లేకపోతే జనాభా ఇంకా తగ్గిపోతే ప్రమాకర పరిస్థితులు వచ్చే సూచనలు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం అప్రమత్తమై భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని జనాభా పెరుగుదల కోసం ప్రణాళికలు రచించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలుస్తోంది. దీని కోసం ఏం చర్యలు తీసుకుంటారో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. మొత్తానికి జనాభా నియంత్రణ చర్యలు ప్రతికూల ప్రభావాన్నే చూపుతున్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read: RRR OTT Release Date: ఓటీటీ డేట్ ను ప్రకటించారు.. ప్రేక్షకులకు శుభవార్త

Tags