Karate Kalyani: కరాటే కళ్యాణి బాగా బోల్డ్. ‘బాబీ పిండేశావ్’ అనే సింగిల్ డైలాగ్ తో బాగా పాపులర్ అయింది ఈ నటి. దాదాపు 250 సినిమాల్లో కరాటే కళ్యాణి నటించినా ఎక్కువగా వ్యాంప్ పాత్రలకే పరిమితం అయింది. కానీ, కరాటే కళ్యాణిలో చాలా కళలే ఉన్నాయి. ఆమెలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో పాటు డాన్సర్ కమ్ సింగర్ కమ్ కరాటే కమ్ హరికథ.. ఇలా మల్టీ టాలెంటెడ్ ఆమె. పైగా సమాజంలో ఏ అన్యాయం జరిగినా తనదైన శైలిలో రెచ్చిపోతుంది.

ఈ క్రమంలో కరాటే కళ్యాణి.. సినిమాల కన్నా వివాదాలతోనే నిత్యం వార్తల్లో వస్తుంటుంది. తాజాగా శ్రీకాంత్ రెడ్డి అనే యూట్యూబర్ ని ఆమె రోడ్డుమీద పరిగెత్తించి.. గుడ్డలూడదీసి మరీ కొట్టింది. ఈ వీడియోకి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
Also Read: AP Government: రయ్..రయ్ కాన్వాయ్ కు డబ్బులు చెల్లించని ఏపీ సర్కార్
అసలు ఇంతకీ ఈ శ్రీకాంత్ రెడ్డి అనే యూట్యూబర్ ను కరాటే కళ్యాణి ఎందుకు కొట్టింది ?, అతను అమ్మాయిలను అగౌరవ పరుస్తూ పిచ్చి పిచ్చి ఫేక్ వీడియోలు చేస్తున్నాడు. ఆ వీడియోలతోనే అతను యూట్యూబ్ లో బాగా పాపులర్ అయ్యాడు. శ్రీకాంత్ రెడ్డి ఎక్కువగా ఆంటీలు, అమ్మాయిలపై ఫ్రాంక్ వీడియోలు చేస్తాడు.

ఆ వీడియోల్లో అతను చాలా అసభ్యకరంగా మాట్లాడతాడు. ఈ పనికిమాలిన వీడియోల పై కరాటే కళ్యాణి విరుచుకు పడింది. గురువారం రాత్రి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పరిధిలో ఉన్న శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ అతన్ని కొట్టింది కళ్యాణి. ఐతే, కరాటే కళ్యాణిని కూడా శ్రీకాంత్ రెడ్డి కొట్టాడు. అయినా ఈ కొట్టుకోవడం ఏమిటి ?
కరాటే కళ్యాణి ‘సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావ్..? అంటూ మొదట అతన్ని చెంపపై కొట్టడం కచ్చితంగా తప్పే. శ్రీకాంత్ రెడ్డి చొక్కా పట్టుకుని కొట్టడంతోనే గొడవ పెద్దదైంది. ఒకవేళ శ్రీకాంత్ రెడ్డి తప్పు చేస్తే.. అతని పై పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అంతేగాని.. ఇలా ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతే ఎలా కళ్యాణి ?
Also Read: Y S Vivekananda Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక సూత్రధారి అయిన ‘లేడీ’ ఎవరూ?



[…] Also Read: Karate Kalyani: మళ్లీ రెచ్చిపోయిన కరాటే కళ్యాణ… […]