2020 సంవత్సరం.. నిజంగానే అందరినీ ట్వంటీ ట్వంటీ ఆడేసింది. కరోనా మహమ్మారి ప్రబలి యావత్ ప్రపంచం ఇంటికే పరిమితమైంది. ఉద్యోగ, ఉపాధి పోయి రోడ్డున పడ్డ వారు ఎందరో.. కరోనా లాక్ డౌన్ తో దేశాలకు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ఈరోజుతో 2020 పీడ విరగడవుతోంది. ఎన్నో ఆశలతో 2021కు వెల్ కం చెబుదాం..
Also Read: పేదల నుంచి ఆ మాటే రావద్దు.. : అధికారులకు సీఎం జగన్ ఆదేశం
ఒకతరం మొత్తం ఎఫెక్ట్ అయ్యేలా 2020 సంవత్సరం భయపెట్టింది. కరోనాతో అందరి జీవితాలను వెంటాడే అనుభవాలను పంచింది. ఏడాదిలో దాదాపు సగానికి పైగా రోజులు అందరూ లాక్ డౌన్ తో ఇంట్లోనే ఉన్నారంటే ఈ సంవత్సరం జనాలను ఎంతగా ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు.
ప్రపంచంతోపాటే ఆంధ్ర ప్రదేశ్ కూడా కరోనా దెబ్బకు కుదేలైంది. ఎన్నో ఉపద్రవాలు, అనుభవాలు, కష్టాలకు ఏపీ లోనైంది. ఏపీలో ఈ సంవత్సరం కరోనాను మించిన వివాదాలు చుట్టుముట్టాయి. అధికార వైసీపీ, ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేశాయి.
*మూడు రాజధానులతో లొల్లి షూరు చేసిన జగన్
గత ఏడాది డిసెంబర్ 2019లో నిర్వహించిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఏపీలోని అమరావతి రాజధానిని పక్కనపెట్టి సీఎం జగన్ మూడు రాజధానులంటూ సంచలన ప్రకటన చేశాడు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట జగన్ చేసిన ఈ ప్రకటన ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య.. చివరకు హైకోర్టులో కూడా ఇప్పటికీ పెద్ద యుద్ధమై నడుస్తోంది.
*ధిక్కరించిన శాసనమండలిని రద్దు చేసిన జగన్
ఇక శాసనసభలో 151 మంది ఎమ్మెల్యేల మద్దతుతో బిల్లులు నెగ్గించుకున్న జగన్.. టీడీపీ బలంగా ఉన్న శాసనమండలిలో మాత్రం నెగ్గించుకోలేకపోయారు. మూడు రాజధానుల బిల్లును కూడా మండలి రద్దు చేసింది. దీంతో ఏకంగా శాసనమండలిని రద్దు చేస్తున్నట్లు జగన్ చేసిన ప్రకటన సంచలనమైంది.
*ఉద్యమించిన అమరావతి
జగన్ మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు, అక్కడ భూములు కొన్న వారు.. ప్రతిపక్ష టీ డీపీ సాయంతో పోరుబాట పట్టారు. ఇప్పటికీ ఆ ఉద్యమం కొనసాగుతూనే ఉంది.
*మిస్టరీ వీడని వైఎస్ వివేకా హత్య కేసు
వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉండగా ఆయన బాబాయి వైఎస్ వివేకా హత్య జరిగింది. నాడు ఇది చంద్రబాబు ప్రభుత్వం చేయించిందని సీబీఐ ఎంక్వైరీ చేయాలన్న జగన్.. అధికారంలోకి వచ్చాక మాత్రం దీనిపై నాన్చి.. సీబీఐకి అప్పగించారు. ఈ విచారణలో ఇప్పటికీ ఈ కేసు తేలకపోవడం గమనార్హం.
Also Read: న్యూ ఇయర్ వేడుకలపై హైకోర్టు ఆగ్రహం..!
*ఏపీని కమ్మేసిన కరోనా..
ప్రపంచంతోపాటు ఏపీలోకి కరోనా మార్చి 12న ఎంట్రీ ఇచ్చింది. తొలి కరోనా కరోనా కేసు 2020 మార్చి లోనే వెలుగుచూసింది. అప్పటి నుంచి పెద్ద ఎత్తున ఈ వైరస్ రాష్ట్రవ్యాప్తంగా పాకి దేశంలో అత్యధిక కేసుల్లో ఏపీ నిలిచింది. దాదాపు 8.71 లక్షల మంది కరోనా బారిన పడి ఏపీలో కోలుకున్నారు. 7100 మంది కరోనాతో మృతి చెందారు.
*స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా
ఏపీలో కరోనాను సాకుగా చూపి జగన్ ప్రభుత్వం నిర్వహించాలనుకున్న ‘స్థానిక సంస్థల’ను ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రద్దు చేయడం సీఎం జగన్ కు ఆగ్రహం తెప్పించింది. నిమ్మగడ్డ పోస్ట్ ను ఊస్ట్ చేయించి చట్టసవరణ చేశాడు జగన్. ఆ తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టులకు వరకు వెళ్లి ఆయన తిరిగి ఏపీ ఎన్నికల కమిషనర్ గా నియామకమయ్యాడు. ఇప్పుడు సైతం నిమ్మగడ్డ స్థానిక ఎన్నికలకు రెడీ కాగా జగన్ సర్కార్ మాత్రం ఎన్నికలకు సిద్ధంగా లేదు.
*లాక్ డౌన్ వేళ కూలీలు, ప్రజలకు కష్టాలు
ఏపీలో కరోనాతో విధించిన లాక్ డౌన్ లో తిండి లేక కూలీలు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం ఇతోధికసాయం చేసి ఆదుకుంది. రేషన్ సహా సరుకులు పంపిణీ చేసి భరోసానిచ్చింది. వలస కూలీలకు రవాణా సౌకర్యాలు కల్పించి వారిని పంపించింది.
ఇక ఇవే కాదు.. ఏపీలోనే డాక్టర్ సుధాకర్ కరోనా వేళ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం.. ఆయన పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం.. ప్రభుత్వం సస్పెండ్ చేయడం.. హైకోర్టులో విచారణ ఏపీలో సంచలనమైంది.
ఇక ఈఎస్ఐ మందుల కుంభకోణంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ కావడం ప్రతిపక్ష టీడీపీని డిఫెన్స్ లోకి నెట్టింది. అధికార పక్షం పైచేయి సాధించింది.
*చీఫ్ జస్టిస్ కు జగన్ లేఖ రాసి సంచలనం
ఏపీలోని హైకోర్టు తీర్పులు.. జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా రావడం.. ప్రభుత్వానికి కోర్టుల్లో చుక్కెదురు కావడం.. ఓ సుప్రీం కోర్టు జడ్జి కూడా ఇందులో ఉన్నాడని ఆరోపిస్తూ సీఎం జగన్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖ దేశవ్యాప్తంగా పెనుమారం రేపింది. ఆ తర్వాత ఏపీ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల బదిలీలు చర్చనీయాంశమయ్యాయి.
Also Read: బ్యాంకులకు మరో కంపెనీ టోకరా : ఐదు వేల కోట్లు ముంచారు
ఇక ఇటీవల ఏపీలో కలకలం రేపి వింత వ్యాధి సైతం దేశవ్యాప్తంగా అంతుచిక్కని మహమ్మారిగా వార్తల్లో నిలిచింది.
ఇవే కాదు.. చుక్కాని లేని నావలా ఉన్న ఏపీబీజేపీకి ఫైర్ బ్రాడ్ అయిన సోము వీర్రాజు అధ్యక్షుడిగా నియామకం కావడం ఏపీ బీజేపీలో జోష్ పెంచింది. ఇక ఏపీ కాంగ్రెస్ కు శైలజానాథ్ అధ్యక్షుడయ్యాడు.
పవన్ కళ్యాణ్ 2020లోనే కమ్యూనిస్టులతో దోస్తీ కట్ చేసి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఏపీ రాజకీయాల్లో సంచలన మార్పుగా మారింది.
ఇక ఏపీలో ఆలయాలపై దాడులు ఏపీలో తీవ్ర కలకలం రేపాయి. వరుసగా అంతర్వేది, తాజాగా విజయనగరం జిల్లాలోనూ హనుమాన్ విగ్రహ తల ద్వంసం.. తిరుపతిలో అపచారాలతో వైసీపీ ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది. నివర్ తుఫాన్ ఏపీలో తీరని నష్టాన్ని మిగిల్చింది. సొంత పార్టీ వైసీపీ ఎంపీ తిరుగుబాటు చేసి ఇప్పటికీ ఆ పార్టీకి కంట్లో నలుసులా మారాడు.
ఇలా ఏపీలో ఒక్క ఏడాదిలో ఎన్నో నేరాలు.. ఘోరాలు.. సంచలనాలు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. కరోనా ఎంతగా వార్తల్లో నిలిచిందో అంతకుమించిన వివాదాలు ఏపీని చుట్టుముట్టాయి.
-నరేశ్
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Andhra pradesh political roundup 2020 ap journey from three capitals judicial controversy corona
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com