AP MPTC ZPTC Elections: ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. కొన్ని జడ్పీటీసీ స్థానాల్లో అర్థరాత్రి దాటిన తర్వాత కూడా లెక్కింపు కొనసాగింది. ఇక ఏపీ అధికారులు అధికారికంగా ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో ఏపీలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో విజేతలు ఎవరో.. గెలుపొందిన పార్టీల వివరాలను వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 7219 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు జరగ్గా.. 5998 చోట్ల వైసీపీ, 826 చోట్ల టీడీపీ, 177 చోట్ల జనసేన, 28 చోట్ల బీజేపీ, 15 చోట్ల సీపీఎం, 8 చోట్ల సీపీఐ, 157 చోట్ల స్వతంత్ర్య అభ్యర్థులు విజయం సాధించారు.
515 జడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించగా.. 502 చోట్ల వైసీపీ విజయం సాధించడం విశేషం. దాదాపు క్లీన్ స్వీప్ గా జగన్ పార్టీ చేయడం గమనార్హం. ఇంత ఏకపక్షంగా తీర్పు ఉంటుందని అస్సలు ఊహించలేదు. ఇక ప్రతిపక్ష టీడీపీ కేవలం 6 జడ్పీటీసీలు కైవసం చేసుకుంది. 2 చోట్ల జనసేన, సీపీఎం, ఇండిపెండెంట్ అభ్యర్థులు చెరో చోట గెలుపొందారు. అసలు బీజేపీ ఖాతా తెరవకపోవడం గమనార్హం.
ఏపీ పరిషత్ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ స్పందించారు. దేవుడి దయ, మీ అందరి దీవెనల వల్లే ఇంతటి అఖండ విజయం సాధమైందని అన్నారు. ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలు రాష్ట్రంలోని ప్రతి కుటుంబం పట్ల, ప్రతి మనిషి పట్ల బాధ్యత పెంచాయని పేర్కొన్నారు.
ఏపీ పరిషత్ ఎన్నికల ఫలితాలు.. జిల్లాల వారీగా..