Prema Entha Madhuram: బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి ప్రేమ కథ నేపథ్యంలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇక అను పెళ్లి మండపానికి మహారాణిలా పూల బాటలో నడుచుకుంటూ వస్తుంది. అక్కడే ఉన్న జలంధర్ మనుషులు పెళ్లి కొడుకు వచ్చాక అప్పుడు ప్రశ్నించాలి అంటూ అనుకుంటారు. ఇక అను అక్కడినుంచి లోపలికి వెళ్ళిపోగా పద్దు పెళ్లి మండపం చూసి ఆశ్చర్యపోతూ సుబ్బు తో మాట్లాడుతుంది. ఇలా ఊహించుకోలేదు అంటే గొప్ప గొప్పగా మాట్లాడుతుంది. ఇక పద్దు అక్కడినుంచి వెళ్లగా సుబ్బు దగ్గరకు ఆర్య తరపున వాళ్ళు వచ్చి పలకరిస్తారు. వెంటనే సుబ్బు వాళ్ళు తనని పలకరించే సరికి ఆశ్చర్యపోతూ కనిపిస్తాడు.
మరోవైపు జలంధర్ ఆర్య పై కోపంతో రగిలిపోతాడు. ప్రతిసారి ఓడిస్తున్నాడు అంటూ ఈసారి ఆర్యను ఓడించడానికి తను చావడానికైనా సిద్ధమే అంటూ తన దగ్గర సిద్ధం చేసుకున్న బాంబును చూసి నవ్వుకుంటాడు. ఇక ఆర్య కూడా పెళ్లి మండపం లోకి ఎంట్రీ ఇవ్వగా పూజారి బావమరిది కావాలి అంటూ అనడంతో సంపత్ వెళ్లి నేను ఉన్నాను అంటూ ఆర్యవి కాళ్లు కడుగుతాడు. ఆర్య సంపత్ మెడలో బంగారం గొలుసును వేస్తాడు. ఇక ఆర్య ముందుకు నడుస్తూ జలంధర్ మాటలు తలుచుకొని ఏం జరుగుతుందో అని కాస్త టెన్షన్ పడతాడు. ఇక రఘుపతి బేరర్ గా కనిపిస్తాడు. అక్కడికి అను ఫ్రెండ్, సంపత్ వచ్చి అతడిని కాసేపు విసిగిస్తారు.
వెంటనే సంపత్ మళ్లీ వచ్చి చూసేసరికి నాన్న నువ్వా అంటూ కాసేపు వెటకారం చేస్తాడు. ఇక అను దగ్గర తన ఫ్రెండ్స్ బాగా ఆటపట్టిస్తారు. ఆర్యతో మాట్లాడేసి వస్తాము అంటూ ఆటపట్టించగా అక్కడికి ఆర్య రావడంతో వెళ్లిపోతారు. ఇక ఆర్యను చూసి అను సిగ్గుతో ఏంటి శ్రీవారు అంటూ మాట్లాడుతుంది. వెంటనే ఆర్య సీరియస్ గా మాట్లాడాలని గతం గురించి మీ నాన్నకు చెబుతాను అంటూ తర్వాత జరిగే పరిణామాలు ఎలా దారితీస్తాయో అని అనుని బ్రతిమాలుతాడు. మొదట అను తన తండ్రి ఏం అంటాడో అని భయపడి తర్వాత ఆర్య కోసం ఒప్పుకుంటుంది. ఇక అందరూ పెళ్లి మండపం లో ఉండగా ఆర్య అను చేయి పట్టుకొని నిజం చెప్పడానికి బయలుదేరుతాడు.