https://oktelugu.com/

AP Liquor: ఏపీలో మద్యనిషేధానికి మంగళం.. పిండుకోవడమే మిగిలింది

AP Liquor: ఆంధ్రప్రదేశ్ లో మద్యం వ్యాపారం ఓ వెలుగు వెలిగిపోతోంది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మారుతోంది. దీంతో మద్య నిషేధం విధిస్తామని జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినా అది ఆచరణలో కనిపించడం లేదు. ఫలితంగా రాష్ట్రంలో మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే కామధేనువుగా తయారయింది. దీంతో ప్రభుత్వం మద్యం విషయంలో ఏమరుపాటుగానే ఉంటోందనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల ముందు జగన్ ప్రజలకు సంపూర్ణ మద్య […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 13, 2022 / 01:34 PM IST
    Follow us on

    AP Liquor: ఆంధ్రప్రదేశ్ లో మద్యం వ్యాపారం ఓ వెలుగు వెలిగిపోతోంది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మారుతోంది. దీంతో మద్య నిషేధం విధిస్తామని జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినా అది ఆచరణలో కనిపించడం లేదు. ఫలితంగా రాష్ట్రంలో మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే కామధేనువుగా తయారయింది. దీంతో ప్రభుత్వం మద్యం విషయంలో ఏమరుపాటుగానే ఉంటోందనే విమర్శలు వస్తున్నాయి.

    AP Liquor

    ఎన్నికల ముందు జగన్ ప్రజలకు సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం దాని గురించి పట్టించుకోవడం లేదు. విడతల వారీగా మద్య నిషేధం చేస్తామని చెప్పినా ఆ దిశగా మాత్రం అడుగులు పడటం లేదు. ఫలితంగా రాష్ర్టంలో మద్యం వ్యాపారం ఓ వెలుగు వెలిగిపోతోంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అరవై శాతం దుకాణాలను తొలగించాల్సి ఉన్నా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గిపోతోందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవడం లేదు. దీంతో మద్యం వ్యాపారం రోజురోజుకు ఇంకా పెరిగిపోతూనే ఉంది.

    Also Read: డిఫరెంట్‌ కాన్సెఫ్ట్‌ తో అనసూయ భరద్వాజ్‌ కొత్త సినిమా

    వచ్చే ఎన్నికల నాటికి కేవలం స్టార్ హోటళ్లలోనే మద్యం దొరికే అవకాశం ఉన్నా ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ సజావుగా సాగేందుకు వేల కోట్లు అప్పుగా తీసుకొచ్చింది. దానికి మద్యం వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయాన్ని చూపించి తెచ్చుకుంది. దీంతో మద్యం వ్యాపారం దూసుకుపోతోంది. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టేందుకు సాయపడుతోంది. ఈ నేపథ్యంలో మద్య నిషేధంపై జగన్ సాహసం చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది.

    దీనిపై టీడీపీ నేతలు ఇప్పటికే సెటైర్లు వేస్తున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు గాలికొదిలేశారని దుయ్యబడుతున్నారు. మద్యం వ్యాపారంతోనే ప్రభుత్వ చక్రం నడుస్తుందని చెబుతున్నారు. అందుకే మద్యం పై సర్కారు పట్టించుకోవడం లేదని విమర్శలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ సర్కారు దీనికి సమాధానం చెప్పాల్సి వస్తుందని ప్రతిపక్షాలు సూచిస్తున్నాయి. మొత్తానికి మద్యం వ్యాపారం జగన్ మెడకు చుట్టుకునే అవకాశం ఏర్పడుతోంది.

    AP Liquor

    మద్యం వ్యాపారం చూపించి అప్పుగా తెచ్చిన వాటికి దాదాపు వచ్చే ఇరవై ఐదేళ్లు మద్యం ద్వారా వచ్చే ఆదాయంతోనే తీర్చేందుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మద్య నిషేధం విధించడం ఇక కల్లే అని తెలిసిపోతోంది. దీంతో జగన్ ఇచ్చిన హామీ ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు.

    Also Read: సినీ స్టార్స్ నేటి క్రేజీ పోస్ట్ లు

    Tags