https://oktelugu.com/

Prabhas Fan Ends Life: ‘రాధేశ్యామ్’ మిక్స్ డ్ టాక్ అని ప్రభాస్ ఫ్యాన్ ఆత్మహత్య

Prabhas Fan Ends Life: సినిమా అంటే పిచ్చి.. ప్రభాస్ అంటే ప్రాణం. ఆయన సినిమా విడుదలైన తొలి షోనే చూసేశాడు. బాహుబలి, సాహో చూసి ప్రభాస్ సినిమాపై అంచనాలు పెంచుకున్నాడు. కానీ తాజాగా విడుదలైన ‘రాధేశ్యామ్’ అంచనాలు అందుకోలేదు. ఆ సినిమా తొలి రోజు తొలి షో చూసిన అభిమాని తట్టుకోలేకపోయాడు. మిక్స్ డ్ టాక్ చూసి.. ఫ్యాన్స్ కామెంట్ చూసి మనస్థాపం చెందాడు. తట్టుకోలేక అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మార్చి 11న రాధేశ్యామ్ మూవీ ప్యాన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 13, 2022 / 01:16 PM IST
    Follow us on

    Prabhas Fan Ends Life: సినిమా అంటే పిచ్చి.. ప్రభాస్ అంటే ప్రాణం. ఆయన సినిమా విడుదలైన తొలి షోనే చూసేశాడు. బాహుబలి, సాహో చూసి ప్రభాస్ సినిమాపై అంచనాలు పెంచుకున్నాడు. కానీ తాజాగా విడుదలైన ‘రాధేశ్యామ్’ అంచనాలు అందుకోలేదు. ఆ సినిమా తొలి రోజు తొలి షో చూసిన అభిమాని తట్టుకోలేకపోయాడు. మిక్స్ డ్ టాక్ చూసి.. ఫ్యాన్స్ కామెంట్ చూసి మనస్థాపం చెందాడు. తట్టుకోలేక అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

    Prabhas

    మార్చి 11న రాధేశ్యామ్ మూవీ ప్యాన్ ఇండియా లెవల్లో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 7వేలకు పైగా స్క్రీన్లలో గ్రాండ్ గా ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ప్రేమకు, విధిరాతకు మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో రాధాకృష్ణ రూపొందించిన ఈ పీరియాడికల్ లవ్ స్టోరీ థియేటర్లలో సందడి చేస్తోంది. ప్రభాస్ , పూజాహెగ్డే హీరోయిన్లుగా నటించారు. కృష్ణంరాజు, భాగ్యశ్రీ కీలక పాత్రధారులు. మూడేళ్ల తర్వాత ప్రభాస్ సినిమా విడుదల కావడంతో అడ్వాన్స్ బుకింగ్ లు బాగా జరిగాయి.

    ఈ క్లాసిక్ లవ్ స్టోరీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. కమర్షియల్ అంశాలు ఏవీ లేకపోవడంతో ఈ సినిమాకు మెయిడ్ డ్రా బ్యాక్ అని చెబుతున్నారు. ఈ సినిమా స్లోగా ఉందని ప్రేక్షకులు సోషల్ మీడియాలో పెదవి విరుస్తున్నారు.

    Also Read: Du Plessis Named RCB Captain For IPL 2022: ఆర్సీబీకి కొత్త సారథి అతనే.. అభిమానుల నమ్మకాన్ని నిలబెడతాడా..?

    ఇక తాజాగా రాధేశ్యామ్ మూవీకి నెగెటివ్ టాక్ వచ్చిందని ప్రభాస్ అభిమాని ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. కర్నూలు తిలక్ నగర్ లో నివాసముండే రవితేజ(24) సినిమా బాగా లేదనే మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

    వెల్డింగ్ పనులు చేస్తూ జీవించే రవితేజ శుక్రవారం విడుదలైన రాధేశ్యామ్ తొలి షోను స్నేహితులతో కలిసి చూశాడు. సినిమాకు వెళ్లొచ్చాకే ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి, స్నేహితులు వచ్చి తలుపుకొట్టినా డోర్ తీయలేదు. తలుపులు బద్దలుకొట్టి చూడగా ఉరివేసుకొని కనిపించాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడని తేల్చారు. రాధేశ్యామ్ సినిమా పెద్దగా బాగాలేదని మధనపడ్డాడని ఆ బాధతోనే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు.

    Also Read: AP Liquor: ఏపీలో మద్యనిషేధానికి మంగళం.. పిండుకోవడమే మిగిలింది