konaseema district name: ఏపీలో కొత్త జిల్లాలు కొలువు దీరాయి. ఇటీవలే అమల్లోకి వచ్చాయి. ఆయా ప్రాంతాలకున్న ప్రాముఖ్యత, ప్రముఖుల పేర్ల ఆధారంగా ఆయా జిల్లాలకు పేర్లు పెట్టింది ప్రభుత్వం. అయితే కొన్ని జిల్లాలపై అభ్యంతరాలు, డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి ఏర్పడిన కోనసీమ జిల్లా పేరు విసయంలో కీలక ప్రకటన చేసింది. కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్లను పరిగణలోకి తీసుకొని ఆ జిల్లా పేరును డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేశారు.
ఇప్పటికే అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, వైఎస్ఆర్ వంటి మహనీయుల పేర్లను పలు జిల్లాలకు పెట్టడంతో అంబేద్కర్ పేరు కూడా పెట్టాలని డిమాండ్లు వచ్చాయి. దీంతో జగన్ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. అయితే కోనసీమ జిల్లా పేరు మార్పు ఇప్పుడు చర్చనీయాంశమైంది.
-కొత్త జిల్లాలు ఇవే
26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ సీఎం జగన్ నిర్ణయించారు. కొత్తగా పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, రాజమండ్రి, నరసాపురం, బాపట్ల, నర్సారావుపేట, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, సత్యసాయి, ఎన్టీఆర్ విజయవాడ జిల్లాలు అమల్లోకి వచ్చాయి.
-కొత్త రెవెన్యూ డివిజన్లు ఇవే
శ్రీకాళహస్తి, , కుప్పం, పలమనేరు, రాయచోటి, పుట్టపర్తి, ధర్మవరం, గుంతకల్, డోన్, ఆత్మకూరు, సత్తెనపల్లి, చీరాల, బాపట్ల, నందిగామ, తిరువూరు, ఉయ్యూరు, భీమవరం, కొత్తపేట, బీమిలి, చీపురుపల్లి, బొబ్బిలి, పలాస లను కొత్త రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేశారు.
Recommended Videos