Telangana: తెలంగాణాలో రాజకీయాలు మారిపోతున్నట్టే మీడియా రంగంలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కొనసాగిన న్యూస్ ఛానెల్స్ కంటే ప్రత్యేక తెలంగాణలో వాటి సంఖ్య చాలా పెరిగిపోయింది. కొన్ని పత్రికలు, ఛానెల్స్ పార్టీలకు అనుబంధంగా ఏర్పాటైతే మరి కొన్ని పత్రికలు ఇండిపెండెంట్‌గా పుట్టుకొచ్చాయి. ఇందులో కొన్ని ప్రత్యేక తెలంగాణ నినాదంతోనే ఉద్భవించాయి. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేకత చాటుకున్నాయి. ఉద్యమాన్ని ఆంధ్రా చానెల్స్ గుర్తించకపోయినా ఇవి విస్తృతంగా కవర్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాయి.

అయితే ఇప్పుడు అలాంటి ఛానెల్స్‌లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో మనకు కూడా మీడియా ఉండాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ‘నమస్తే తెలంగాణ‘ దినపత్రికను,‘టీ న్యూస్’ అనే సాటిలైట్ ఛానెల్ ను ఏర్పాటు చేశారు. ఇందులో నమస్తే తెలంగాణ.. మన పత్రిక, మన ఆత్మగౌరవం అనే నినాదంతో ఉద్భవించగా, టీ న్యూస్ తెలంగాణ గుండె చప్పుడు అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లింది. తెలంగాణ గొంతుకను వినిపించేందుకు ఏర్పాటైన టీ న్యూస్‌కు ఇప్పుడు ఆంధ్రా కు చెందిన ఓ వ్యక్తి సీఈవోగా నియమితులయ్యారు. ఇది కొంత ఆశ్చర్యపరిచే అంశమే. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో టీ న్యూస్, నమస్తే తెలంగాణ పత్రికలు విస్తృతంగా న్యూస్‌ను కవర్ చేసింది. తెలంగాణ(Telangana) ప్రజలు కూడా నమస్తే తెలంగాణ దినపత్రికనే కొనేవాళ్లు, టీ న్యూస్‌నే చూసేవాళ్లు. అంతలా ప్రజల్లో సెంటిమెంట్ ను రగలించాయి ఆ సంస్థలు. అయితే ఇప్పుడు అలాంటి న్యూస్ ఛానెల్‌కు ఆంధ్రాకు చెందిన వ్యక్తి సీఈవో గా బాధ్యతలు స్వీకరించడం ఇప్పుడు జర్నలిస్టు వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఎవరాయాన ? నేపథ్యం ఏంటి ?
ఎన్టీవీ గ్రూప్‌లో పని చేసిన అనుభవం ఉన్న వీ. సుందర రామ శాస్త్రి ప్రస్తుతం టీ న్యూస్ పగ్గాలు చేపట్టారు. రిటైర్డ్‌మెంట్ వయసు కూడా పూర్తయ్యింది. ఆయనకు ప్రస్తుతం నమస్తే తెలంగాణ ఎడిటర్‌గా పని చేస్తున్న తిగుళ్ల కృష్ణామూర్తికి చాలా సాన్నిహిత్యం ఉంది. వీరిద్దరూ ఈనాడు నుంచి వచ్చిన వారే. ఇప్పటి నుంచే వీరి మధ్య స్నేహం ఉన్నట్టు తెలుస్తోంది. తరువాత వీరిద్దరూ వివిధ సంస్థల్లో పని చేస్తూ వస్తున్నారు. తిగుళ్ల కృష్ణమూర్తి నమస్తే తెలంగాణ దినపత్రికకు ఎడిటర్ గా బాధ్యతలు చేపట్టకముందు ఆంధ్రజ్యోతిలో పనిచేశారు. అయితే ఇప్పుడు టీ న్యూస్ సీఈవోగా వి కృష్ణమూర్తిని నియమించడంలో తిగుళ్ల కృష్ణమూర్తి కీలకపాత్ర పోషించనట్టు అర్థమవుతోంది.
అలాగే హెచ్ఎంటీవీకి సీఈవోగా బాధ్యతలు నెరవేరుస్తున్న చంద్రశేఖర్ కూడా ఇటీవల రాజీనామా చేశారు. ఆ ఛానెల్‌లో ఎవరూ ఎక్కువ కాలం నిలవడం లేదు. వచ్చిన కొన్ని నెలలకే ఏవో కారణాలతో బయటకు వెళ్లిపోతున్నారు. పేరు మోసిన కపిల్ చిట్ ఫండ్స్ సంస్థ యజమానులే ఈ హెచ్ ఎంటీవీని నిర్వహిస్తున్నారు. ఆ బిజినెస్‌ను సక్సెస్ ఫుల్‌గా నిర్వహిస్తున్నప్పటికీ.. మీడియా రంగంలో ఉన్న టీవీ ఛానెల్ ను మాత్రం సరిగా నిర్వహించలేకపోతున్నారనే జర్నలిస్టు వర్గాల్లో టాక్ నడుస్తోంది.
Also Read: ఏపీకి మూడు రాజధానులు.. జగన్ కీలక నిర్ణయం?