Homeఎంటర్టైన్మెంట్Pushpa: అల్లు అర్జున్​ పుష్ప కౌంట్​డౌన్​ స్టార్ట్​.. హ్యాష్​టాగ్​తో ట్విట్టర్​లో సందడి!

Pushpa: అల్లు అర్జున్​ పుష్ప కౌంట్​డౌన్​ స్టార్ట్​.. హ్యాష్​టాగ్​తో ట్విట్టర్​లో సందడి!

Pushpa: ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​ హీరోగా సుకుమార్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా పుష్ప. పాన్​ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇందులో రష్మికా హీరోయిన్​గా నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో ఫహద్ ఫాసిల్​, సునీల్​ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు అనసూయ కూడా మాస్​ క్యారెక్టర్​లో దర్శనమివ్వనుంది. ఈ ఏడాది డిసెంబరు 17న ఐదు భాషల్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం. ఇటీవలే హిందీ వర్షన్​ విడుదలకు సంబంధించిన సమస్యలు కూడా తీరిపోయినట్లు తెలుస్తోంది.

pushpa

అయితే, ప్రస్తుతం ట్విట్టర్​లో పుష్ప అనే హ్యాష్​ టాగ్​తో అభిమానులు సందడి చేస్తున్నారు. పుష్ప కౌంట్​డౌన్​ స్టార్ట్​ అయ్యిందంటూ పోస్ట్ లు చేస్తున్నారు. ఈ రోజు నుంచి కరెక్టుగా సినిమా విడుదలకు నెలరోజులు ఉంది. వచ్చే నెల ఇదే రోజున సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే బన్నీ అభిమానులు పుష్ప కౌంట్​డౌన్​ స్టార్ట్​ అని పోస్టులు చేస్తున్నారు. దీన్ని బట్టి తెలుస్తోంది ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో. మరోవైపు, ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ కు విపరీతమైన స్పందన లభిస్తోంది. దీనికి తోడు నవంబరు 17న బన్నీకి ఈ సినిమాలో ఫేవరెట్​ సాంగ్​ అయిన ఏయ్​ బిడ్డా పాటను విడుదల చేయనున్నారు.

ప్రస్తుతం సినిమా షూటింగ్​ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు సుకుమార్​. డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్​ ఈ సినిమాను నిర్మిస్తోంది.  జగపతి బాబు, సునీల్, అనసూయ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular