Chandrababu- ABN RK: టిడిపి ప్రభుత్వ హయాంలో కొన్ని సంస్థల నుంచి ముడుపులు అందుకున్నారన్నది చంద్రబాబుపై ఉన్న అభియోగం. అయితే దీనిపై ఎల్లో మీడియా పెద్దగా నోరు విప్పడం లేదు. కనీసం వార్త అన్నట్టు భావించడం లేదు. కనీస స్థాయిలో కూడా ప్రచురించడం లేదు. తిరిగి అసలు ఆదాయ పన్ను శాఖ చంద్రబాబుకు నోటీసులు ఇవ్వలేదని బుకాయిస్తోంది. చంద్రబాబు తాజా నోటీసులకు సంబంధించి కేసు ఇప్పటిది కాదని.. సుమారు ఏడేళ్ల కిందటదేనని టాక్ నడుస్తోంది. ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’ అన్న ట్యాగ్ లైన్ సొంతం చేసుకున్న రాధాకృష్ణ.. 2016 లోనే ఆంధ్రజ్యోతిలో ప్రత్యేక కథనం ప్రచురించారు.
ఆపరేషన్ సి ఆర్ డి ఏ అనే శీర్షిక న ఆంధ్రజ్యోతిలో ప్రత్యేక కథనం ఏడేళ్ల కిందట ప్రచురితమైంది. భూముల కొనుగోలు, కార్యాలయ భవనాలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులు సమకూర్చడం, చిన్నచిన్న కాంట్రాక్టర్లను కేటాయించడంలో భారీగా చేతులు మారాయని.. ఇందులో ఓ మంత్రి కి హస్తం ఉందని నాడు ఆంధ్రజ్యోతి అనుమానిస్తూ ఒక కథనాన్ని రాసుకొచ్చింది. అంటే ఈ కేసు 2016 నుంచి కొనసాగుతుందన్నమాట. అప్పట్లోనే తాత్కాలిక సచివాలయం, కోర్టు భవనాల నిర్మాణం వంటి వాటిలో టిడిపి నేతలు అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీతో పాటు విపక్షాలు ఆరోపణలు చేశాయి. అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఇంకా ఎన్డీఏ లోనే ఉంది. అయినా సరే ఆదాయ పన్ను శాఖ ఫోకస్ పెంచింది. ఎన్డీఏ నుంచి టీడీపీ దూరం కావడం, 2019 ఎన్నికల్లో టిడిపి ఓటమి చవి చూడడంతో.. ఈ కేసులో ఉన్న లూప్ హోల్స్ ను కేంద్రం వెతకడం ప్రారంభించింది.
అయితే తాజాగా ఆ 118 కోట్ల ముడుపుల గురించి చంద్రబాబుకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. కానీ దానిని ఒక తప్పిదంగా చూపించే ప్రయత్నం చేస్తోంది ఆంధ్రజ్యోతి. నాడే ముందే హెచ్చరిస్తూ చెప్పిన విషయాన్ని మరిచిపోయినట్టుంది. అవి ముడుపులే కావన్నట్టు.. అసలు అవినీతి జరగనట్టు.. ఇప్పుడు అదే ఆంధ్రజ్యోతి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. మసి పూసి మారేడు కాయ చేస్తోంది. నాడు అవినీతి జరిగిందని.. విచారణ జరపనున్నారని చెప్పిన ఆంధ్రజ్యోతి… ఇప్పుడు ఐటి ఇచ్చిన నోటీసులు అవినీతి గురించి కాదని బుకాయిస్తోంది