Mahesh Vitta Marriage: చిన్న చిన్న యూట్యూబ్ వీడియోస్, షార్ట్స్ ద్వారా తనకంటూ ఓ ఇమేజ్ రాబట్టాడు. ఆ తర్వాత టాలీవుడ్ లో కమెడియన్ గా పలు చిత్రాల్లో నటించాడు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తలో అవకాశాలు కోసం కష్టపడిన మహేష్, నేడు సొంతంగా నిర్మాణ సంస్థను స్థాపించే స్థాయికి చేరుకున్నారు.
కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మహేష్ రాయలసీమ యాసలో మాట్లాడుతూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా మహేష్ విట్టా పెళ్లి బంధం లోకి అడుగుపెట్టి ఒక ఇంటి వాడయ్యాడు. తాను ప్రేమించిన శ్రావణి రెడ్డి అనే అమ్మాయి తో ప్రొద్దుటూరు లోని హెల్త్ క్లబ్ ఫంక్షన్ హాల్ లో వారిద్దరి వివాహం కన్నుల పండుగగా జరిగింది.
ప్రస్తుతం వారి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ బిగ్ బాస్ 3 లోకి వచ్చిన సమయంలో తాను ప్రేమలో ఉన్నట్లు తెలిపారు. కానీ అమ్మాయి పేరు మాత్రం బయటకు చెప్పలేదు. తాను శ్రావణి రెడ్డి సుమారు గా ఐదేళ్ల నుంచి ప్రేమించు కుంటున్నట్లు చెప్పాడు. ఆమె తన చెల్లెలు ఫ్రెండే అని మహేష్ చెప్పుకొచ్చాడు.
మొదటి లో మహేష్ ప్రేమను ఆమె అంగీకరించలేదు. కానీ పట్టు వదలని విక్రమార్కుడు గా ప్రయత్నించి చివరికి ఆమె అంగీకరించేలా చేశాడు. మొదటి రెండేళ్లు ఫ్రెండ్స్ గా తిరిగిన మహేష్ – శ్రావణి ఆ తర్వాత ప్రేమికులుగా మారినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రావణి రెడ్డి ఒక టాప్ MNC కంపెనీ లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తుంది. ఇక మహేష్ విట్టా సినిమాల్లో రాణిస్తూ ముందుకు సాగుతున్నాడు.