Samantha: నాగచైతన్య – సమంత విడిపోతున్నాం అంటూ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చిన దగ్గర నుంచి నెటిజన్లతో పాటు సినీ ప్రముఖులు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా సమంత స్నేహితురాలు, మరియు సమంత మేకప్ ఆర్టిస్ట్ అయిన ‘సద్నా సింగ్’ కూడా సామ్ విడాకుల పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మరి ఏమి చెప్పిందో ఆమె మాటల్లోనే.. ‘సామ్ గురించి నేను కొత్తగా ఏమి చెప్పాలి. సామ్ ఎలాంటిదో అందరికీ తెలుసు. కానీ నేను కొన్ని ఏళ్లుగా సమంత(Samantha) కు మేకప్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నాను కాబట్టి.. సామ్ ను దగ్గర నుంచి గమనించాను కాబట్టి చెబుతున్నాను. సామ్ ఎంతో మంచి మనసున్న వ్యక్తి. తను తన టీమ్ లో ఉన్న ప్రతి వ్యక్తిని సంతోష పెట్టేది. వారి పై ఎంతో ప్రేమను చూపించేది. మాకు తెలుసు.. చై – సామ్ జంట చూడముచ్చటగా ఉండేది.
చైతన్య అంటే సమంతకు ఎంతో ఇష్టం. చై కోసం తాను ఎప్పుడు తపన పడుతూ ఉండేది. అలాంటి వాళ్లిద్దరూ ఎందుకు విడిపోయారనేది నాకూ పూర్తిగా తెలీదు. అయితే, బయట ప్రపంచంలో ముఖ్యంగా సోషల్ మీడియాలో అనేక పుకార్లు వైరల్ అవుతున్నాయి. వాటిల్లో ఒకటి.. సామ్ పిల్లల్ని కనడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు అని. కానీ అందులో ఏ మాత్రం నిజం లేదు.
సామ్ పిల్లల విషయంలో ఎప్పుడూ నో చెప్పలేదు. నిజానికి సమంతకు పిల్లలంటే ప్రాణం. త్వరగా పిల్లల్ని కనాలని, త్వరగా ఫ్యామిలీ లైఫ్ ప్రారంభించాలని సమంత ఎన్నో కలలు కంది. మీకు తెలుసా ? సామ్ తరచూ పిల్లల పెంపకం గురించి బుక్స్ కూడా చదువుతుండేది. ఆ సమయంలోనే ‘ఫ్యామిలీ మేన్-2’ తర్వాత సామ్ కు బాలీవుడ్ నుంచి వరుస అవకాశాలు వచ్చాయి. వాటన్నింటికీ నో చెప్పింది.
ఇదే విషయం నేను ఒకేసారి ఆమెను అడిగాను. అయితే, సామ్ చెప్పిన సమాధానం ‘ముందు నాకు నా ఫ్యామిలీ ముఖ్యం’ అని చెప్పింది. ఇక జుకల్కర్-సామ్ రిలేషన్ గురించి వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. జుకల్కర్.. సామ్‌ని అక్క అని పిలుస్తాడు’’ అని సద్నా చెప్పుకొచ్చింది.