https://oktelugu.com/

Anandi Gopal Joshi : తొలి భారతీయ మహిళా వైద్యురాలు.. ఆమె స్టోరీ తెలిస్తే షాక్ అవుతారు

ఆనందీభాయి జోషి తన నిర్ణయాన్ని భర్తతో తెలిపింది. వైద్య విద్యను అభ్యసించాలనే తన అభిప్రాయాన్ని తన భర్త కూడా సపోర్ట్ చేశారు. దీంతో ఆమె అమెరికాలో పెన్సిల్వేనియా ఉమెన్స్ కాలేజీలో మెడిసిన్ కోర్సు పూర్తిచేశారు.

Written By:
  • NARESH
  • , Updated On : September 17, 2024 / 04:26 PM IST

    Anandi Gopal Joshi is recognized as the first Indian woman doctor in the country

    Follow us on

    Anandi Gopal Joshi : చిన్న వయస్సులోనే ఎన్నో కష్టాలను చూసి.. వాటిన్నంటిని అధిగమించి దేశంలోనే మొదటి భారతీయ మహిళా వైద్యురాలిగా గుర్తింపు పొందిన మహిళ ఆనందీభాయి జోషి. ఈమె తన జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చిన కూడా కష్టపడి డాక్టర్ అయ్యారు. లైఫ్‌లో ఒకటి సాధించాలని అని ఫిక్స్ అయిన తర్వాత ఎన్ని ఆటంకాలు వచ్చిన వాటిని విడిచిపెట్టకూడదు. ఏదైనా ఒక పనిని ప్రారంభించిన తర్వాత ఆటంకాలు వచ్చాయని కొందరు వాటిని మధ్యలోనే వదిలేస్తారు. కానీ ఎవరో ఒకరు మాత్రమే గట్టిగా అనుకుని వాళ్ల లక్ష్యానికి చేరువకి వెళ్తారు. అలాంటివారిలో ఆనందీభాయి జోషి కూడా ఒకరు. ఈమె గురించి పూర్తి స్టోరీ తెలిస్తే షాక్ అవుతారు. పూర్తి వివరాలు తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

    ఆనందీభాయి జోషి మహారాష్ట్రలో థానేలోని ఓ సంపన్న కుటుంబంలో జన్మించారు. ఈమె అసలు పేరు యమున. అయితే ఆనందీభాయిని తల్లిదండ్రులు చిన్న వయస్సులోనే పెళ్లి చేశారు. తన కంటే 20 ఏళ్లు పెద్దయిన గోపాలరావు అనే వ్యక్తితో ఆమెకి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన సమయానికి ఆనందీభాయి వయస్సు 9 ఏళ్లు. ఏమి తెలియని వయస్సులోనే ఆమెకు వివాహం జరిగింది. అయితే ఆనందీభాయి జోషి భర్త తపాలాశాఖలో పనిచేసేవారు. పెళ్లికి ముందు యమునగా ఉన్న ఆమె పేరును పెళ్లయిన తర్వాత ఆనందీభాయి గోపాలరావు జోషీగా అతను మార్చారు. వీళ్లకి పెళ్లయిన ఐదేళ్ల తర్వాత ఆనందీభాయికి ఓ కుమారుడు జన్మించాడు. అంటే అప్పటికీ ఆమె వయస్సు 14ఏళ్లు. అయితే పుట్టినప్పటి నుంచి ఆ బిడ్డకు అనారోగ్య సమస్యలు వచ్చాయి. సరైన వైద్యం లేక పుట్టిన పది రోజులకే ఆ బిడ్డ చనిపోయాడు. దీంతో జోషి తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యారు. ఎన్నో రోజులు తన బిడ్డ గురించి చింతించింది. చివరికి తన బిడ్డలా ఇంకా ఏ బిడ్డ కూడా వైద్యం అందకుండా చనిపోకూడదని.. వైద్య విద్యను అభ్యసించాలని నిర్ణయించుకున్నారు.

    ఆనందీభాయి జోషి తన నిర్ణయాన్ని భర్తతో తెలిపింది. వైద్య విద్యను అభ్యసించాలనే తన అభిప్రాయాన్ని తన భర్త కూడా సపోర్ట్ చేశారు. దీంతో ఆమె అమెరికాలో పెన్సిల్వేనియా ఉమెన్స్ కాలేజీలో మెడిసిన్ కోర్సు పూర్తిచేశారు. అయితే ఆమె విదేశాల్లో చదువుతున్నప్పుడే క్షయ వ్యాధి బారిన పడ్డారు. అయిన పట్టు విడవకుండా తన ఆరోగ్యం ఎంత క్షీణించినా కూడా చదువును నిర్లక్ష్యం చేయలేదు. ఇలా తాను వైద్య విద్యను పూర్తిచేశారు. అయితే భారతదేశం నుంచి మెడిసిన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన మొదటి మహిళ ఆనందీభాయి జోషి. దీనికి విక్టోరియా రాణి అభినందనలు కూడా తెలిపారు. అయితే రోజురోజుకు ఆమె ఆరోగ్యం క్షీణించడంతో 1886లో భారతదేశం తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఆరోగ్యం కాస్త బాగున్నాక కొల్హాపూర్‌లోని అల్బర్ట్ ఎడ్వర్డ్ ఆసుపత్రిలో ఫిజిషియన్‌గా చేరారు. తక్కువ కాలంలోనే మంచి వైద్యురాలిగా గుర్తింపు పొందారు. కానీ క్షయ వ్యాధి మాత్రం ఈమెను వెంటాడింది. తన 21ఏళ్ల వయస్సులో క్షయవ్యాధి కారణంగా చనిపోయారు. దేశంలో వైద్య విజ్ఞాన శాస్త్రాన్ని అభివృద్ధి చేసిన ఈమెకు గౌరవంగా ‘ఆనందీభాయి జోషి అవార్డ్ ఫర్ మెడిసిన్‌’ని ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అండ్ డాక్యుమెంటేషన్ ఇన్ సోషల్ సైన్సెస్ ఇప్పటికీ ప్రదానం చేస్తోంది. మహరాష్ట్ర ప్రభుత్వం కూడా ఈమె పేరుతో ఫెలోషిప్‌ను ఏర్పాటు చేసింది.