Allu Arjun: రెండు సార్లు బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జాతీయ అవార్డుని అందుకున్న జానీ మాస్టర్ కెరీర్ ఇప్పుడు సంక్షోభం లో పడింది. లైంగిక వేధింపులు చేస్తున్నాడంటూ ఒక శ్రేష్టి వర్మ అనే యంగ్ డ్యాన్సర్ జానీ మాస్టర్ పై నిన్న హైదరాబాద్ లోని నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అవుట్ డోర్ షూటింగ్స్ లో తనపై తరచూ లైంగిక వేధింపులు చేసేవాడని, తన కోరికలు తీర్చేందుకు మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాల్సిందిగా ప్రతీ రోజు టార్చర్ చేసేవాడని, ఆయన భార్య కూడా ఇందులో ఒక భాగం అంటూ FIR లో పేర్కొన్నది శ్రేష్టి వర్మ. సమాజం గురించి గొప్పగా మాట్లాడుతూ, జనసేన పార్టీ లో చేరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన జానీ మాస్టర్ లో ఇలాంటి కోణం కూడా ఉందా అని అందరూ ఆశ్చర్యపోయారు.
సెలబ్రిటీస్ కి ఇలాంటి ఆరోపణలు కొత్తేమి కాదు, కానీ అది నిజం కానప్పుడు వెంటనే స్పందించి అభిమానులకు క్లారిటీ ఇచ్చేవారు. కానీ జానీ మాస్టర్ అలాంటి పని ఇప్పటి వరకు చేయలేదు. కనీసం ట్విట్టర్ లో అయినా స్పందించి, తాను తప్పు చేయలేదని బలమైన గొంతు వినిపిస్తాడని అనుకున్నారు అందరూ, కానీ కనీసం అది కూడా జరగలేదు. దీంతో జానీ మాస్టర్ నిజంగా తప్పు చేసాడని దాదాపుగా నిర్ధారణ అయిపోయినట్టే అని చెప్పొచ్చు. జానీ మాస్టర్ మీద ఇలాంటి కేసులు రావడం కొత్తేమి కాదు, గతంలో కూడా ఆయనపై ఇలాంటి కేసులు చాలానే వచ్చాయి. ఇది ఇలా ఉండగా నేడు ఫిలిం ఛాంబర్ కి సంబంధించిన సభ్యులు జానీ మాస్టర్ కేసు వ్యవహారం పై ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసారు.
ఈ ప్రెస్ మీట్ లో వాళ్ళు మాట్లాడుతూ ‘ సినీ పరిశ్రమలో ఎవరికీ ఎలాంటి సమస్య వచ్చినా మా ఛాంబర్ కి ఫిర్యాదు చేయండి, మేము విచారణ చేపట్టి తగిన చర్యలు కచ్చితంగా తీసుకుంటాము. ప్రముఖ కొరియోగ్రాఫర్ జాన్ మాస్టర్ పై ఫిర్యాదు చేసిన అమ్మాయికి అండగా మా చిత్రపరిశ్రమ మొత్తం ఉంది. పెద్దవాళ్ళతో పెట్టుకొని వారిపై ఫిర్యాదు చేస్తే అవకాశాలు రావు అనే భయం వద్దు, ఒక స్టార్ హీరో తన మ్యానేజర్ ద్వారా ఫోన్ చేయించి ఆ అమ్మాయికి తన తదుపరి సినిమాలో అవకాశం ఇప్పించాడు. ఒక దర్శకుడు కూడా ఆ అమ్మాయికి తన తదుపరి చిత్రం అవకాశం ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. కాబట్టి ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. లైంగిక వేధింపుల పై ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పది కేసులు మా ముందుకు వచ్చాయి, అందులో కొన్ని ఫేక్ కంప్లైంట్స్ కూడా ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉండగా శ్రేష్టి వర్మ కి అవకాశం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన స్టార్ హీరో ఎవరో కాదు, మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని తెలుస్తుంది. అల్లు అర్జున్ జానీ మాస్టర్ తో కలిసి చేసిన ‘బుట్ట బొమ్మ’ సాంగ్ నేషనల్ వైడ్ గా పాపులారిటీ ని సంపాదించుకొని నేషనల్ అవార్డు ని కూడా సొంతం చేసుకుంది. తన కెరీర్ లో అలాంటి పాట ఇచ్చిన కొరియోగ్రాఫర్ ని కూడా కాదని, ఆ అమ్మాయికి అల్లు అర్జున్ అండగా నిలబడడం అతనిలోని మానవత్వానికి నిదర్శనం అని అంటున్నారు విశ్లేషకులు.