https://oktelugu.com/

ఆనందయ్య మందు: ప్రభుత్వం హ్యాండ్ ఇచ్చిందా?

ప్రపంచంలోని ఏ అల్లోపతి మందు , వ్యాక్సిన్ కూడా తగ్గించలేని కరోనాను ఆనందయ్య మందు తగ్గించడం గొప్ప పరిణామంగా నిలిచింది. ఆనందయ్య మందు పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఈ క్రమంలోనే దానిపై పరిశోధించి మరీ ప్రభుత్వాలు అనుమతించాయి. అంతా బాగానే ఉంది. ఆనందయ్య మందు తయారీ కూడా చేపట్టారు. కేసులు లక్షల్లో ఉండడం..ఆనందయ్య మందు వేలల్లో ఉండడంతో ఆయన తాహతు సరిపోవడం లేదు. మూలికల కొరత, పంపిణీ పెద్ద సమస్యగా మారింది. దీంతో ఏపీ ప్రభుత్వం సహకరించాలని […]

Written By:
  • NARESH
  • , Updated On : June 10, 2021 / 11:43 AM IST
    Follow us on

    ప్రపంచంలోని ఏ అల్లోపతి మందు , వ్యాక్సిన్ కూడా తగ్గించలేని కరోనాను ఆనందయ్య మందు తగ్గించడం గొప్ప పరిణామంగా నిలిచింది. ఆనందయ్య మందు పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఈ క్రమంలోనే దానిపై పరిశోధించి మరీ ప్రభుత్వాలు అనుమతించాయి.

    అంతా బాగానే ఉంది. ఆనందయ్య మందు తయారీ కూడా చేపట్టారు. కేసులు లక్షల్లో ఉండడం..ఆనందయ్య మందు వేలల్లో ఉండడంతో ఆయన తాహతు సరిపోవడం లేదు. మూలికల కొరత, పంపిణీ పెద్ద సమస్యగా మారింది. దీంతో ఏపీ ప్రభుత్వం సహకరించాలని ఆనందయ్య ఏకంగా సీఎం జగన్ కు లేఖ రాశారు.

    కానీ ఏపీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఆనందయ్యకు ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో ఆనందయ్య డైలామాలో పడ్డారు. ఇంత మందికి ఎలా పంపిణీ చేయాలి? తయారు చేయాలన్నది ప్రశ్నర్థకంగా మారింది.

    గురువారం సాయంత్రం వరకు ఏపీ ప్రభుత్వం స్పందించకుంటే తన నిర్ణయం ప్రకటిస్తానని ఆనందయ్య తెలిపారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ఎలా పంపాలనే దానిపై తన బృందంతో గురువారం చర్చిస్తామన్నారు. ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవ చేస్తామన్నారు.

    ప్రస్తుతం ఆనందయ్య తన కృష్ణపట్నంలోనే కరోనా ఆయుర్వేద మందు తయారు చేస్తున్నాడు. తన గ్రామంలో పంచి సర్వేపల్లి నియోజకవర్గంలో పంపిణీ చేస్తున్నారు. దాదాపు 50వేల మంది కరోనా సోకిన వారికి ఇచ్చేందుకు మందు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత ఏంటన్నదే ఇప్పుడు ప్రశ్న. ప్రభుత్వం హ్యాండ్ ఇవ్వడంతో ఆనందయ్య ఏం చేస్తాడన్నది వేచిచూడాలి.