నట సింహం బాలయ్య తన పుట్టినరోజు సందర్భంగా మరో బాక్సాపీస్ వేట మొదలుపెట్టారు. గోపీచంద్ మలినేనితో బాలయ్య 107వ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీత సారధ్యంలో ఈ సినిమా రానుంది. త్వరలోనే మా సింహం వేట మొదలవుంతుంది అని మేకర్స్ బాలయ్య అభిమానులకు ఫుల్ జోష్ ను ఇచ్చారు.
ఇక బాలయ్య పుట్టినరోజు కావడంతో ఆయన అభిమానులు అండ్ సినీ ప్రముఖులు బాలయ్యకి శుభాకాంక్షలు చెప్పడానికి పోటీ పడుతున్నారు. అయితే, బాలయ్య బర్త్ డే నాడు ఏదైనా టీజర్ రిలీజ్ చేసి ఉంటే బాగుండేది అని అభిమానుల అభిప్రాయ పడుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కానీ, బాలయ్య – గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఎనౌన్స్ మెంట్ వీడియో మాత్రం ఈ సినిమా పై భారీగా అంచనాలు పెంచుతోంది.
ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన స్టార్ హీరోయిన్ ను బుక్ చేయాలని డైరెక్టర్ గోపిచంద్ మలినేని సన్నాహాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో శృతి హాసన్, బాలకృష్ణ సరసన నటించడానికి అంగీకరించిందని వార్తలు వచ్చాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంతవరకు రాలేదు. దర్శకుడు గోపీచంద్ మలినేనికి శృతి హాసన్ తో మంచి బంధం ఉంది కాబట్టి, ఆ చనువుతో ఆమెను ఒప్పించే అవకాశం ఉంది.
అలాగే రీసెంట్ గా సీనియర్ హీరోయిన్ త్రిష పేరు కూడా వినిపించింది. ప్రస్తుతం ఆమె ఖాళీగానే ఉంది. పైగా ఆమె గతంలో బాలయ్యతో ఆల్ రెడీ ఒక సినిమా కూడా చేసింది. సో.. ఇప్పుడు ఎలాగూ తనకు సినిమాలు లేవు కాబట్టి, ఎట్టిపరిస్థితుల్లో బాలయ్య సినిమా వస్తే వదులుకోదు. అందుకే ప్రస్తుతం త్రిషను హీరోయిన్ గా ఫైనల్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు మైత్రీ మూవీ మేకర్స్, కానీ గోపిచంద్ మలినేని మాత్రం శ్రుతీ హసన్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.