https://oktelugu.com/

Anand Mahindra : అతడి ఆనందాన్ని చూసి చలించి పోయాను.. ఆనంద్ మహీంద్రా

Anand Mahindra : ఆనంద్ మహీంద్రా ఆధ్వర్యంలో నడుస్తున్న మహీంద్రా కంపెనీలో లక్షలాదిమంది ఉద్యోగులు ఉన్నారు. ఈ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తోంది.

Written By: , Updated On : March 21, 2025 / 11:45 AM IST
Anand Mahindra

Anand Mahindra

Follow us on

Anand Mahindra : ఆనంద్ మహీంద్రా ఆధ్వర్యంలో నడుస్తున్న మహీంద్రా కంపెనీలో లక్షలాదిమంది ఉద్యోగులు ఉన్నారు. ఈ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తోంది. మనదేశంలో ఆటోమొబైల్, ఐటి, విమానయాన రంగాలలో మహీంద్రా కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిభట్ల ప్రాంతంలో మహీంద్రా కంపెనీకి ఏరోస్పేస్ సెంటర్ ఉంది. ఇక్కడ రక్షణ రంగ ఉత్పత్తులను, పౌర విమాన యాన రంగానికి చెందిన ఉత్పత్తులను మహీంద్రా కంపెనీ తయారుచేస్తోంది. ఆనంద్ మహీంద్రా పేరుపొందిన వ్యాపారవేత్త అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటుంటారు. అందువల్లే ఆయనను సోషల్ మీడియాలో మిలియన్ల మంది అనుసరిస్తుంటారు. సమాజంలో ప్రతిభావంతమైన వ్యక్తులు చేసిన పనులను బయట ప్రపంచం దృష్టికి తీసుకురావడంలో ఆనంద్ మహీంద్రా ముందు వరుసలో ఉంటారు. అంతేకాదు తన కంపెనీ ద్వారా వారికి సహాయ సహకారాలు కూడా అందిస్తుంటారు.

Also Read : సునీతా విలియమ్స్ ను కలిశాం.. దాన్నే వాషింగ్టన్ మూమెంట్ అంటారేమో…

చలించి పోయారు

ఆనంద్ మహీంద్రా పేరుపొందిన వ్యాపారవేత్త మాత్రమే కాదు.. సున్నితమైన అంశాలను పంచుకుంటూ.. తన భావోద్వేగాన్ని వ్యక్తం చేస్తుంటారు. దానికి తగ్గట్టుగానే వ్యాఖ్యలు చేస్తూ తనదైన ముద్రను చాటుకుంటారు. సరిగ్గా ఏడాది క్రితం తన ట్విట్టర్ ఖాతాలో ఆనంద్ మహీంద్రా ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఒక లగ్జరీ కారు కనిపిస్తోంది. అది పూర్తిగా పసిడివర్ణంలో ఉంది. ఓ దివ్యాంగుడైన వ్యక్తి మన స్మార్ట్ ఫోన్ తో ఆ కారు పక్కన నిల్చుని ఒక సెల్ఫీ దిగాడు. దానిని చూసిన ఆ కారు ఓనర్ వెంటనే వచ్చి.. ఆ దివ్యాంగుడైన వ్యక్తిని దగ్గరికి తీసుకున్నారు. అతడిని ప్రేమతో లోపలికి పిలిచి.. కారులో కూర్చో పెట్టారు. అతన్ని కూర్చోబెట్టుకొని కారు రైడ్ చేశారు. ఈ విషయం ఆనంద్ మహీంద్రా దృష్టికి వచ్చింది. ఆయన వెంటనే దీనిని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన తనదైన వ్యాఖ్యను దీనికి జోడించారు. ” సరిగ్గా ఈ వీడియోను ఏడాది క్రితం నా ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాను. ఇటీవల దీనిని చూశాను.. దానిని చూసిన తర్వాత నా అభిప్రాయాన్ని చెప్పకుండా ఉండలేకపోయాను. ముందుగా కారు యజమానికి, ఆయన దాతృత్వ స్ఫూర్తికి, సానుభూతికి ధన్యవాదాలు.. కార్ల తయారీదారుగా.. మెరుగైన కార్లను ప్రజలకు అందించగల వ్యక్తిగా నేను నిరాడంబరమైన ఆనందాన్ని పొందాలి. ఆ ఆనందాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలి. మహీంద్రా కంపెనీలో మా డిజైనర్లు, ఇంజనీర్లు భవిష్యత్తును ముందుగానే ఊహిస్తారు. సృజనాత్మకతను అంచనా వేస్తారు. కార్లు అంటే కేవలం రవాణా పరికరాలు మాత్రమే కాదు అంతకుమించి.. అభిరుచితో వాహనాలను రూపొందించేటప్పుడు.. వాటిని అనుభవించే అవకాశం కూడా అందరికీ ఇవ్వాలి. అప్పుడే అవి ఆనందాన్ని అందిస్తాయని” ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. ఆనంద్ మహీంద్రా రీ ట్వీట్ చేసిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటున్నది.

Also Read : డ్రోన్స్ పైన దాడి చేస్తాయి.. నిజంగా ఇవి శత్రుభీకర గరుడలు.. తెలంగాణ పోలీస్ లపై ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్