Anand Mahindra Tweet viral
Anand Mahindra : తెలంగాణ పోలీస్ (Telangana Police)కు భారతదేశం లోని తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖను సూచిస్తుంది. ఇది చట్టాన్ని అమలు చేయడం, ప్రజల భద్రతను కాపాడడం, పౌరుల హక్కులను రక్షించడం కోసం పని చేస్తుంది. తెలంగాణ పోలీస్ శాఖలో వివిధ విభాగాలు ఉన్నాయి, అవి ప్రతి దిశలో వివిధ విధులను నిర్వహిస్తాయి, ఉదాహరణకు, క్రై మ్ బ్రాంచ్, ట్రాఫిక్ పోలీస్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ ( ఖీఊ), మరియు మరిన్ని ఉన్నాయి. ఇది 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా స్థాపించబడింది. ప్రస్తుతం, తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్ అనేక ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి పలు సేవలు అందిస్తుంది, ప్రజల భద్రతను పెంచడానికి వాటిని పరిష్కరిస్తుంది. అయితే తెలంగాణ పెరుగుతున్న నేరాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకుంటోంది. తాజాగా గరుడ స్క్వాడ్ ఏర్పాటు చేసింది. ఇది అసాంఘిక శక్తులు ప్రయోగించే డ్రోన్లను కూల్చడానికి ఉపయోగిస్తోంది. దీని పనితీరు మెరుగ్గా ఉంది. దీంతో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తెలంగాణ గరుడ స్క్వాడ్ వీడియోను షేర్ చేస్తూ.. టెక్నాలజీ అభివృద్ధి, ప్రకృతి శక్తుల ప్రాధాన్యతను ప్రశంసించారు.
ఆసక్తికరమైన పోస్టు..
ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. అత్యాధునిక టెక్నాలజీ గురించి ప్రజలకు తెలియచేయడంలో అరుదైన, వినూత్నమైన విషయం గురించి చర్చించడంలో ఎప్పుడూ ముందు ఉంటారు. తాజాగా తెలంగాణ గరుడ స్క్వాడ్ శిక్షణను ప్రశంసిస్తుంటారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి జరిగినా.. ప్రకృతి శక్తుల ప్రాధాన్యత ఎప్పటికీ నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ఆయన పోస్టుపై సోషల మీడియాలో నెటిజన్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
గరుడ దళం పనితీరు వివరిస్తూ..
మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం ఎక్స్‌లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా ఈ గరుడ దళం అనే ప్రమాదకర డ్రోన్లను ఎలా అదుపులోకి తెస్తుందో వివరించారు. ఈ ప్రత్యేక గద్దల బృందాన్ని పౌండు(సుమారు 450 గ్రాములు) నుంచి 2 కిలోల బరువు ఉన్న డ్రోన్లను పట్టుకుని వాటిని గాల్లోనే నిర్వీర్యం చేయడానికి శిక్షణ ఇస్తున్నారు. ఇవి నో ఫ్లయింగ్ జోన్‌లలో అనుమతి లేని డ్రోన్లపై దాడిచేసేలా సిద్దం చేశారు. వైరల్ అవుతున్న వీడియోలో 10 సెన్లలో గరుడ గద్ద గాల్లోనే డ్రోన్‌ను పంజాల్లో ముట్టడి చేసే అద్భుత దృశ్యం కనబడుతోంది. ఈ గద్ద కాళ్లకు ప్రత్యేకమైన నెట్(జాలి) అమర్చబడి ఉంటుంది. దీనిసాయంతో డ్రోన్లను ఫాస్టుగా పట్టుకుంటాయి. అని ఈ క్లిప్‌ను పోస్టు చేస్తూ ఆనందర్ మహీంద్రా వివరించారు.
40 వేల వ్యూస్..
ఈ పోస్టును ఆనంద్ మహీంద్రా జనవరి 30న పోస్టు చేశారు. 24 గంటల్ల ఈ వీడియోను 40 వేల మందికిపైగా వీక్షించారు. 2 వేల మంది లైక్ చేశారు. కామెంట్ సెక్షన్‌లో అనేక మంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. గద్దలు ఎప్పుడూ ఆకాశంలో సైనికులుగా గుర్తింపు పొందాయి అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. ఈ బలమైన గద్దలు నిజంగా ఆకాశ రాజులే అని పేర్కొంటున్నాడు.