Shiva Sena and TRS: ఆదిత్యఠాక్రేపై తిరుగుబాటు.. మరి కేటీఆర్ పై ఎప్పుడు?

Analysis on Shiva Sena and TRS Family Politics మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలు మిగతా రాష్ట్రాలపై ఆ ప్రభావం పడబోతోందా? వీటిని మనం తక్కువగా చూడలేం.దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. శివసేన పార్టీ ‘మరాఠీ’ల ఆరాధ్య దైవంగా భావించి అధికారంలోకి వచ్చింది. టీఆర్ఎస్ కూడా ఇలానే ‘తెలంగాణ ఆత్మగౌరవం’తో అధికారంలోకి వచ్చింది. అటు మరాఠీల ఆత్మగౌరవం.. ఇటు తెలంగాణ ఆత్మగౌరవంగానే గెలిచారు. ఉద్దవ్ ఠాక్రే పాలన కుటుంబ పార్టీగా మారిపోయింది. కేసీఆర్ ది కూడా కుటుంబ […]

Written By: NARESH, Updated On : June 25, 2022 7:04 pm
Follow us on

Analysis on Shiva Sena and TRS Family Politics మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలు మిగతా రాష్ట్రాలపై ఆ ప్రభావం పడబోతోందా? వీటిని మనం తక్కువగా చూడలేం.దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. శివసేన పార్టీ ‘మరాఠీ’ల ఆరాధ్య దైవంగా భావించి అధికారంలోకి వచ్చింది. టీఆర్ఎస్ కూడా ఇలానే ‘తెలంగాణ ఆత్మగౌరవం’తో అధికారంలోకి వచ్చింది. అటు మరాఠీల ఆత్మగౌరవం.. ఇటు తెలంగాణ ఆత్మగౌరవంగానే గెలిచారు.

ఉద్దవ్ ఠాక్రే పాలన కుటుంబ పార్టీగా మారిపోయింది. కేసీఆర్ ది కూడా కుటుంబ పాలనగా మారింది. ఉద్దవ్ తర్వాత ఆదిత్య.. కేసీఆర్ తర్వాత కేటీఆర్ పాలనలో కీలకంగా మారారు.

శివసేన ఇప్పుడు ఇంతలా దిగజారిపోవడానికి కారణం.. ఉద్దవ్ ను మెజార్టీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించడం.. కొడుకు ఆదిత్య పగ్గాలు, పాలన అప్పగించేసి మిగతా వారిని డమ్మీలుగా చేసింది శివసేన. ఏక్ నాథ్ షిండే శివసేనను బలంగా మార్చడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ ప్రభుత్వంలో ఆయనకు విలువ లేకుండా పోయింది. ఉద్దవ్ కుమారుడు ఆదిత్యదే ఇప్పుడు మహారాష్ట్రలో నడుస్తోంది.

తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన అందరూ టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారే ఇప్పుడు తెలంగాణ కేబినెట్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఈటల రాజేందర్ ను పొగబెట్టి బయటపకు పంపారు. హరీష్ రావును తగ్గించేశారు. కేటీఆర్ కు పట్టాభిషేకం కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఈక్రమంలోనే ‘ఆదిత్య ఠాక్రే, కేటీఆర్’ ల రాజకీయాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..