Freedom of Expression: భావ స్వేచ్ఛ, మత స్వేచ్ఛ ఏదీ ముఖ్యం?

Analysis on Freedom of Expression vs Freedom of Religion : దేశంలో భావ స్వేచ్ఛ ముఖ్యమా? మత స్వేచ్ఛ ముఖ్యమా? అన్నది చర్చనీయాంశమైంది. మతంపేరుతో ఇతరుల హక్కులను తొక్కిపెట్టాలన్నది చాలా రోజులుగా జరుగుతోంది. దేశంలో ఇతర మతాల గురించి మాట్లాడితే ఇంతటి స్పందన ఊహించలేదు. ఇతరులు హిందూ మతంపై మాట్లాడితే ఈ స్థాయి స్పందన లేదు. ఇప్పుడు దేశంలో ఇస్లాం మతం గురించి ఏమన్నా.. ప్రవక్త గురించి ఏ మాట అన్నా అది పెద్ద వివాదంగా […]

Written By: NARESH, Updated On : June 8, 2022 10:16 pm
Follow us on

Analysis on Freedom of Expression vs Freedom of Religion : దేశంలో భావ స్వేచ్ఛ ముఖ్యమా? మత స్వేచ్ఛ ముఖ్యమా? అన్నది చర్చనీయాంశమైంది. మతంపేరుతో ఇతరుల హక్కులను తొక్కిపెట్టాలన్నది చాలా రోజులుగా జరుగుతోంది. దేశంలో ఇతర మతాల గురించి మాట్లాడితే ఇంతటి స్పందన ఊహించలేదు. ఇతరులు హిందూ మతంపై మాట్లాడితే ఈ స్థాయి స్పందన లేదు.

ఇప్పుడు దేశంలో ఇస్లాం మతం గురించి ఏమన్నా.. ప్రవక్త గురించి ఏ మాట అన్నా అది పెద్ద వివాదంగా మారడం చర్చనీయాంశమైంది. చంపేస్తాం అంటూ బెదిరిస్తున్నారు. లూటీలు, దౌర్జన్యాలు చేస్తున్నారు. భావ స్వేచ్ఛ లేకుండా ఆధునిక సమాజంలో భయంగా బతకాల్సిన పరిస్థితులున్నాయి.

ఇప్పుడు నుపూర్ శర్మ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలపై గల్ఫ్, ముస్లిం దేశాలు భగ్గుమనడం ఆశ్చర్యంగా ఉంది. భావ స్వేచ్ఛ అనేది ఈ మతప్రాతిపదికన ఏర్పడిన దేశాల్లో లేదు. రాచరికం ఉన్న అక్కడ ఆంక్షలున్నాయి. కానీ ప్రజాస్వామ్య, ఆధునిక దేశాల్లో స్వేచ్ఛగా మాట్లాడొచ్చు.

మతద్వేషాన్ని రెచ్చగొట్టొద్దు.. దానికి చట్టాలున్నాయి. కానీ భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా బెదిరింపులకు దిగితే పరిస్థితి ఏంటి? ఎవరూ మాట్లాడని పరిస్థితి నెలకొంది. ఒకనాడు క్రిస్టియానిటీ, ఈరోజు ఇస్లాం భావ స్వేచ్ఛ, మత స్వేచ్ఛ ఏదీ ముఖ్యమన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..