https://oktelugu.com/

pregnant women  : వర్షాకాలంలో గర్భిణీలు జననేంద్రియాల జాగ్రత్త తీసుకోవాల్సిందేనా? లేదంటే ఏం జరుగుతుందో తెలుసా?

బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా ఉండటానికి రెస్ట్‌రూమ్‌ని ఉపయోగించిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసి డోర్ పెట్టేయండి. ఇక యోనిని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అంటున్నారు నిపుణులు. దురద, మంట, లేదా దుర్వాసన వంటి లక్షణాలు ఉంటే గైనకాలజిస్ట్ ను వెంటనే సంప్రదించాలి. ఎందుకంటే ఇవి ఈస్ట్ ఇన్ఫెక్షన్ లేదా బాక్టీరియల్ వాగినోసిస్ వంటి యోని సంక్రమణ సంకేతాలు కావచ్చట. సమస్యలను నివారించడానికి మొదట్లోనే చికిత్స తీసుకోవడం ఉత్తమం.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : July 18, 2024 / 06:39 PM IST
    Follow us on

    pregnant women : వర్షాకాలంలో చాలా అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. అందులో గర్బిణీ స్త్రీలకు తక్కువ రోగనిరోధ శక్తి ఉంటుంది కాట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక జననేంద్రియాల పరిశుభ్రత మరీ ముఖ్యం. యోని విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. తేమ వల్ల అంటువ్యాధులు కూడా వస్తాయట. ఈ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. యోని విషయంలో మరింత ఇన్ఫెక్షన్లు, సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? లేదంటే ఎలాంటి వ్యాధులు వచ్చే ఆస్కారం ఉందనే విషయాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

    యోని పరిశుభ్రత: వర్షాకాలంలో తేమ, తేమతో కూడిన పరిస్థితులు హానికరమైన బ్యాక్టీరియా, శిలీంధ్రాల పెరుగుదలకు అనువైన వాతావరణాన్ని సృష్టించగలవు. యోని ఇన్ఫెక్షన్ల ఈ సమయంలో ఎక్కువ అవుతాయి అంటున్నారు నిపుణులు.. గర్భిణీ స్త్రీలకు రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి వ్యాధులు మరింత త్వరగా వస్తాయట. గర్భిణీ స్త్రీలు పరిశుభ్రత మీదశ్రద్ధ వహించాలి అంటున్నారు నిపుణులు. శ్వాసకు ఇబ్బంది లేకుండా కాటన్ లోదుస్తులను ధరించాలని, బిగుతుగా ఉండే దుస్తులను నివారించాలి అంటున్నారు.

    బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా ఉండటానికి రెస్ట్‌రూమ్‌ని ఉపయోగించిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసి డోర్ పెట్టేయండి. ఇక యోనిని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అంటున్నారు నిపుణులు. దురద, మంట, లేదా దుర్వాసన వంటి లక్షణాలు ఉంటే గైనకాలజిస్ట్ ను వెంటనే సంప్రదించాలి. ఎందుకంటే ఇవి ఈస్ట్ ఇన్ఫెక్షన్ లేదా బాక్టీరియల్ వాగినోసిస్ వంటి యోని సంక్రమణ సంకేతాలు కావచ్చట. సమస్యలను నివారించడానికి మొదట్లోనే చికిత్స తీసుకోవడం ఉత్తమం.

    గర్భధారణ సమయంలో, ముఖ్యంగా వర్షాకాలంలో తేమతో కూడిన పరిస్థితుల కారణంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్లు (UTIలు) అభివృద్ధి చెందే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అంటే ఎక్కువగా నీరు తాగాలి. తరచుగా మూత్రవిసర్జన చేయాలి. యోనిని క్లీన్ గా ఉంచుకోవాలి.

    యోని దురద, చికాకు: వర్షాకాలంలో పెరిగిన తేమ, చెమట వలన యోని వద్ద దురద, చికాకు వంటి సమస్యలు వస్తుంటాయి. కఠినమైన సబ్బులు ఉపయోగించడం మానుకోండి. బదులుగా, తేలికపాటి, సువాసన లేని పరిశుభ్రత ఉత్పత్తులను మాత్రమే వినియోగించండి. దురద కంటిన్యూగా ఉన్నా తీవ్రం అవుతున్నా..వైద్యులను సంప్రదించాలి.

    ఇతర జననేంద్రియ సమస్యలు: వర్షాకాలంలో గర్భం దాల్చడం వల్ల బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్‌ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ లేదా నెలలు నిండకుండానే ప్రసవం వంటి ఇతర స్త్రీ జననేంద్రియ సమస్యల ప్రమాదం కూడా పెరుగుతుంది. రెగ్యులర్ ప్రినేటల్ చెక్-అప్‌లను చేసుకోవాలి. ఏవైనా అసాధారణ లక్షణాలు కనిపిస్తే వాటి గురించి మీ వైద్యుడికి చెప్పాలి.

    హైడ్రేటెడ్‌గా ఉండడం: యోని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వర్షాకాలం అంతా పుష్కలంగా నీరు త్రాగడం చాలా కీలకం అంటున్నారు నిపుణులు. గర్భిణీ స్త్రీలు ఇన్‌ఫెక్షన్‌లకు గురయ్యే అవకాశం ఉంది. అందుకే ఎక్కువసేపు తేమకు గురికావద్దు. ముఖ్యంగా తడి బట్టలతో ఎక్కువ సేపు అసలు ఉండకూడదు. ఎందుకంటే ఇవి హానికరమైన సూక్ష్మజీవుల పెరుగుదలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి.

    సహజ నివారణలు: వర్షాకాలంలో కొన్ని యోని అసౌకర్యాలను తగ్గించడానికి కొన్ని సహజ నివారణలు మీకు సహాయం చేస్తాయి.. ఉదాహరణకు, మీ ఆహారంలో ప్రోబయోటిక్స్‌ను చేర్చడం వల్ల యోనిలో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా సమతుల్యతను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. అదనంగా, టీ ట్రీ ఆయిల్ లేదా లావెండర్ ఆయిల్ వంటి సున్నితమైన నూనెలను ఉపయోగించడం వల్ల దురద, చికాకు నుంచి ఉపశమనం పొందవచ్చు కానీ మీరు ఇంటి వద్ద ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా సరే మీ వైద్యులను ఒకసారి సలహా తీసుకోవాలి.