Andhra Pradesh: ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ పాలన.. ఆనాటి పరిస్థితులు.. నేటి ప్రభుత్వ పాలన, ప్రస్తుత పరిస్థితులను పోల్చుతూ ఎడిటర్స్ తమ వెర్షన్‌ను ప్రజల ముందు పెట్టారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎలాంటి ఫలితాలినిచ్చాయి. ఇప్పటి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వలన ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న గందరగోళంపై తమదైన అనాలసిస్‌ను అందించారు ఎడిటర్స్.. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
2014లో ఉమ్మడి ఆంధ్రా రాష్ట్రం రెండుగా విడిపోయింది. ధనిక రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తే, ఏపీ అప్పుల రాష్ట్రంగా మారింది. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగా నాడు కొత్త రాష్ట్రానికి పరిశ్రమలు వెల్లువెత్తాయి. సంక్షేమానికి సంక్షేమం ఉంది. ప్రాజెక్టులు.. అభివృద్ధి పనులు పరుగులు పెట్టాయి. ఉద్యోగులకు రావాల్సినవి సరైన సమయానికే వచ్చాయి. ఐదేళ్లలో కనీసం ఆర్టీసీ చార్జీలు కూడా పెంచలేదు. ఎంతో లోటు బడ్జెట్‌తో ప్రారంభమైనప్పటికీ ఆ లోటు తగ్గించుకుంటూ ఏ ఒక్క వర్గమూ రోడ్డెక్కకుండా చూసుకోవడంలో ప్రభుత్వంలో సక్సెస్ అయింది. ఇక కలల రాజధాని అమరావతి శరవేగంగా నిర్మాణం అవుతూ ఉండేది.
తీరా జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల గడిచాక సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. జీతాలు తగ్గించారని ఉద్యోగులు రోడ్డెక్కారు. ఓటీఎస్ పేరుతో రూ. పదివేలు వసూలు చేస్తున్నారని పేదలు గగ్గోలు పెడుతున్నారు. కరెంట్ చార్జీలు మూడింతలయ్యాయి. పెట్రోల్, డీజిల్ దేశంలోనే అత్యధికంగా ఉన్నా కనికరించేవారు. ఇసుక బంగారం అయిపోయింది. అన్ని వ్యాపారాల మీద దెబ్బకొట్టేశారు. చివరికి సినిమా ధియేటర్లనూ మూసేసుకోవాల్సి వచ్చింది. మద్యం అలవాటు ఉన్న పేదలను పీల్చి పిప్పి చేస్తూ ప్రభుత్వం పండగ చేసుకుంటోంది. అమరావతి శిథిలం అయిపోయింది. పోలవరం అగిపోయింది.
Also Read: కొడాలి నాని ‘క్యాసినో’ పై టీడీపీ తగ్గేదేలే.. గుడివాడలో ఉద్రిక్తత
ఇవన్నీ జగన్ ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం అని సీనియర్లు చెబుతున్నారు. 2014లో చంద్రబాబు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చినా నాడు ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఫిట్మెంట్ కూడా అందులో సగమే ఇచ్చింది. తీరా హెచ్‌ఆర్‌ఏ కోత పెట్డడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రం ఇష్టానుసారంగా సలహాదాలరును నియమించుకోవడం, వారికి లక్షల్లో జీతాలివ్వడం, సాక్షి పత్రికకు టైంకు ఫండ్స్ , యాడ్స్‌తో పాటు స్పెషల్ విమానాలకు ఎందుకు ఖర్చుపెడుతున్నారని ఎడిటర్స్ వాయిస్ ప్రధానంగా ప్రశ్నిస్తోంది. లక్షల కోట్లు అప్పులు చేసి ఏం చేశారు. రాజధాని నిర్మాణం లేదు. పోలవరం, పోర్టుల అభివృద్ధి, ప్రాజెక్టులు, మూడు రాజధానుల నిర్మాణం ఇవన్నీ ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. ఇదేం పాలన రా బాబు అనుకునే స్థాయిలో జగన్ నిర్ణయాలు ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తున్నాయి.
Also Read: జగన్ బుజ్జగించినా తగ్గేదేలే.. 7 నుంచి సమ్మెకు ఏపీ ఉద్యోగులు..