Homeక్రీడలుT20 World Cup 2022: టీ20 వరల్డ్ కప్ -2022 షెడ్యూల్ రిలీజ్.. భారత్, పాక్...

T20 World Cup 2022: టీ20 వరల్డ్ కప్ -2022 షెడ్యూల్ రిలీజ్.. భారత్, పాక్ తొలి మ్యాచ్ ఎప్పుడంటే..?

T20 World Cup 2022: టీ20 వరల్డ్ కప్ -2022 టోర్నమెంట్‌కు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్ (ICC)అందుకు సంబంధించిన వేదికలు, తేదికలను శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తున్న టీ20 పురుషుల క్రికెట్ ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లోనే టీమిండియా దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది. ఐసీసీ విడుదల చేసిన టోర్నీ షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 13 వరకు మ్యాచులు జరుగుతాయి. 16 నుంచి 21 వరకు ఫస్ట్ రౌండ్ (క్వాలిఫైయింగ్) మ్యాచులు జరగనున్నాయి. అసలు మ్యాచెస్ అక్టోబర్ 22 నుంచి ప్రారంభంకానున్నాయి.

T20 World Cup 2022
T20 World Cup 2022

గతేడాది టీ20 వరల్డ్‌కప్ చాంపియన్, ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు అక్టోబర్ 22న తొలి మ్యాచ్‌ న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఇక గ్రూప్‌-2 సూపర్‌ 12 స్టేజ్‌లో భారత్‌ తలపడనుంది. అక్టోబర్‌ 23న తొలి పోరులో దాయాది పాకిస్థాన్‌ను టీమిండియా ఢీకొట్టబోతోంది. కాగా, గ్రూప్‌-2లో భారత్‌తో పాటు పాకిస్థాన్‌, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌ ఉన్నాయి. ఇక నవంబర్‌ 9న సిడ్నీ వేదికగా తొలి సెమీఫైనల్‌ ఉంటే.. నవంబర్‌ 10న అడిలైడ్ వేదికగా రెండో సెమీస్‌ ఉంటుంది. నవంబర్‌ 13న మెల్‌బోర్న్‌ వేదికగా ఫైనల్‌ జరగనుంది.

T20 World Cup 2022
T20 World Cup 2022

2007 నుంచి ఇప్పటివరకు మొత్తం 7 టీ20 ప్రపంచకప్ టోర్నీలు జరిగాయి. తొలి టీ20 వరల్డ్‌కప్‌ను ధోనీ సారథ్యంలోని భారత్ గెలుచుకుంది. ఆ తర్వాత వెస్టిండీస్ రెండు సార్లు, పాకిస్థాన్, ఇంగ్లండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా చెరోసారి విజేతలుగా నిలిచాయి. టీ20 ప్రపంచ కప్ -2022 ఫైనల్ షెడ్యూల్ ప్రకారం.. గ్రూప్‌-2 సూపర్‌ 12 స్టేజ్‌లో భారత్‌ తలపడనుంది. అక్టోబర్‌ 23న జరిగే తొలి మ్యాచ్ లోనే ఇండియా జట్టు పాకిస్తాన్‌ను ఢీకొట్టబోతోంది.

Also Read: మళ్లీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టీ20 ఫస్ట్ మ్యాచ్.. ఈసారి ఏం జరుగనుంది?

T20 World Cup 2022
T20 World Cup 2022

2020లో జరగాల్సిన ప్రపంచకప్ కరోనా కారణంగా 2021లో జరిగిన విషయం తెలిసిందే. అయితే, గత ప్రపంచ కప్‌లో భారత్ దాయాది పాక్ చేతిలో తొలిసారి పరాజయం పాలైంది. గతేడాది అక్టోబర్ 24వ తేదిన భారత్, పాక్ మ్యాచ్ జరగగా.. ఈ ఏడాది అక్టోబర్ 23న ఒక్కరోజు ముందు జరగనుంది. గత వరల్డ్ కప్‌లో పాక్ ఫైనల్ వరకు ఒక్క ఓటమి లేకుండా దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈసారి పాక్ దూకుడు భారత్ జట్టు తొలి మ్యాచ్‌లో కళ్లెం వేస్తుందా లేదా తెలియాలంటే అక్టోబర్ వరకు వేచిచూడాల్సిందే.

Also Read: వరుస ఓటములు.. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో నెగ్గడం కష్టమే.. నెటిజన్స్ ట్రోల్స్!

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Exit mobile version