సీఎం జగన్ కు షాకిచ్చిన ఓ నిరుద్యోగి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఓ నిరుద్యోగి సీఎంకు పెద్ద ట్విస్టే ఇచ్చాడు. దీంతో ఇప్పుడు జగన్ ఏం చేస్తారు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనే చర్చ జరుగుతోంది. ఈ విషయంలో సీఎం జగన్ మౌనంగా ఉంటే అది తమ మెడకే చుట్టుకుంటుందని గొడ్డలిపెట్టుగా మారుతుందని అంటున్నారు పరిశీలకులు. మరి ఇంతకీ ఆ నిరుద్యోగి ఇచ్చిన ట్విస్ట్ ఏమిటీ? ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టిన కొత్తలో ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టారు. దీనికి […]

Written By: Srinivas, Updated On : June 21, 2021 6:30 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఓ నిరుద్యోగి సీఎంకు పెద్ద ట్విస్టే ఇచ్చాడు. దీంతో ఇప్పుడు జగన్ ఏం చేస్తారు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనే చర్చ జరుగుతోంది. ఈ విషయంలో సీఎం జగన్ మౌనంగా ఉంటే అది తమ మెడకే చుట్టుకుంటుందని గొడ్డలిపెట్టుగా మారుతుందని అంటున్నారు పరిశీలకులు. మరి ఇంతకీ ఆ నిరుద్యోగి ఇచ్చిన ట్విస్ట్ ఏమిటీ?

ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టిన కొత్తలో ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టారు. దీనికి స్పందన అని పేరు పెట్టారు. ప్రభుత్వంలోని లోపాలు, అధికారులు చేసే తప్పులను ప్రశ్నించేందుకు ప్రజలకు అవకాశం ఇచ్చారు. ఈ స్పందనలో వచ్చే ఫిర్యాదులను ప్రత్యేకంగా పరిశీలించి సాధ్యమైనంత వరకువేగంగా చర్యలు తీసుకునేందుకు జగన్ ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. దీంతో ప్రతి వారం దీనిపై సమీక్షలు చేసేవారు.

ఇప్పుడు స్పందన వేదిక ద్వారా ఓ నిరుద్యోగి ఫిర్యాదు చేశాడు. అది కూడా ఏకంగా ముఖ్యమంత్రిపైనే. 2009లో 6500 పోలీస్ కానిస్టేబుల్ భర్తీ చేస్తామని ప్రకటించారు. తీరా జాబ్ క్యాలెండర్ లో 450 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కర్నూలు జిల్లాకు చెందిన ఆ నిరుద్యోగి స్పందన కాల్ సెంటర్ కు ఫోన్ చేశాడు. లక్షలాది నిరుద్యోగులను మోసం చేసిన సీఎం, హోం మంత్రిలపై చర్యలు తీసుకోవాలని కోరాడు.

సీఎం, హోంమంత్రిపై కేసు నమోదు చేయడం కుదరదని కాల్ సెంటర్ నిర్వాహకులు సమాధానమిచ్చారు. అన్యాయం జరిగితే ఎలాంటి వారినైనా స్పందనలో ఫిర్యాదుచేయవచ్చని సీఎం స్వయంగా చెప్పారని గుర్తు చేశాడు. ఫిర్యాదు తీసుకోకపోతే రాష్ర్టపతికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సీఎం ఏం చేస్తారనేదానిపై అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.