https://oktelugu.com/

Terrorist Attack: జమ్మూ కశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదుల పంజా.. ఈసారి దారుణం.. నలుగురు భారత సైనికుల వీరమరణం

దోడా జిల్లాలోని దెస్సా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు కశ్మీర్‌ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూ కశ్మీర్‌ పోలీసులు కలిసి సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఉగ్రవాదులు కాల్పులు జరిపి తప్పించుకునరేందుకు యత్నించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఎదురుపడి కాల్పులుకు తెగబడ్డారు. దీంతో భద్రతాబలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 16, 2024 / 02:00 PM IST

    Terrorist Attack

    Follow us on

    Terrorist Attack: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ దొంగదెబ్బ కొట్టారు. దోడా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో ఒక ఆర్మీ అధికారితోపాటు నలుగురు జవాన్లు అమరులయ్యారు. జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఒక పోలీస్‌ గాయపడ్డాడు.

    సెర్స్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తుండగా…
    కేంద్రంలో మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక కశ్మీర్‌లో ఉగ్రదాడులు పెరిగాయి. గత నెలలో బస్సపై దాడిచేశారు. తర్వాత కాల్పులు జరిపారు. తాజాగా సోమవారం(జూలై 15న) రాత్రి సైనికులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు.. పొదల్లో నక్కి సైనికులపై కాల్పులు జరిపారు ఈ దాడిలో ఆర్మీ అధికారి, నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందారు.

    పక్కా సమాచారంతో..
    దోడా జిల్లాలోని దెస్సా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు కశ్మీర్‌ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూ కశ్మీర్‌ పోలీసులు కలిసి సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఉగ్రవాదులు కాల్పులు జరిపి తప్పించుకునరేందుకు యత్నించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఎదురుపడి కాల్పులుకు తెగబడ్డారు. దీంతో భద్రతాబలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఆర్మీ అధికారి, నలుగురు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులు పారిపోయారు.

    హెలికాప్టర్లతో సెర్చ్‌..
    ఈ ఘటన తర్వాత భద్రతా బలగాలు పారిపోయిన ఉగ్రవాదుల కోసం హెలిక్యాప్టర్లతో సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఇప్పటికీ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఇదిలా ఎండగా వారం క్రితం కథువా జిల్లాలో సైనిక వాహనంపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. మరో ఐదుగురు గాయపడ్డారు. పదిమంది బృందం మాచేడీ–కిండ్లీ–మల్హార్‌ రోడ్డు మార్గంలో ట్రక్కులో వెళ్తూ గస్తీ నిర్వహిస్తుండగా ముష్కరులు ఒక్కసారిగా వాహనంపై గ్రెనేడ్‌ విసిరారు. దీంతో ఐదుగురు సైనికులు మృతిచెందారు.

    పూంచ్, రాజౌరీ జిల్లాల్లో ప్రారంభం..
    కశ్మీర్‌లో ఉగ్రదాడులు మొదట పూంచ్, రాజౌరి జిల్లాలో మొదట ప్రారంభమయ్యాయి. ఇప్పుడు రాష్ట్రమంతటా విస్తరించాయి. కొన్నేళ్లుగా ఇక్కడ ఎలాంటి ఉగ్ర కార్యకలాపాలు లేవు. ఇక జమ్ము ప్రాంతంలో 32 నెలల్లో జరిగిన ఉగ్రదాడుల్లో 40 మందికిపైగా సైనికులు మరణించారు.

    60 మంది ఉగ్రవాదులు..
    జమ్మూ ప్రాంతంలో సుమారు 60 మంది ఉగ్రవాదులు యాక్టివ్‌గా పనిచేస్తున్నట్లు సైనికులు గుర్తించారు. గత నెలలలో భద్రతా అంశాలపై సమీక్ష నిర్వహించన మోదీ ఉగ్ర వాద వ్యతిరేక కార్యకలాపాలు పటిష్టం చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదులు పైచేయి సాధించొద్దని సూచించారు. అయినా.. ఉగ్ర దాడులు కొనసాగుతున్నాయి. దీంతో కశ్మీర్‌ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

    ఈ ఏడాది ఎన్నికలు..
    ఇదిలా ఉంటే.. ఈ ఏడాది చివరన జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. ఈమేరకు సుప్రీం కోర్టుకు కూడా తెలిపారు. ఈ క్రమంలో అధికారులు ఓటరు జాబితా సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉగ్ర కార్యకలాపాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.