తమ కళ్ళ యెదుటనే అసాంఘిక శక్తులు తుపాకులు కలుస్తూ, పొడవైన కత్తులతో రహదారులపై సవైరవిహారం చేస్తుంటే చూస్తూ ఉండిపోయిన పోలీసులను ఆయన వెనుక వేసుకు వచ్చారు. పైగా మూడు రోజులలో అల్లర్లను కట్టడి చేశారు అంటూ ప్రశంశ కురిపించారు.
అల్లర్లలో ఢిల్లీ పోలీసులకు ప్రమేయం ఉన్నట్లు వ్యాప్తి అవుతున్న వీడియోలను పరిశీలించామని, ఎక్కడా వారి పాత్ర కనిపించలేదని, పైగా అల్లర్లను అరికట్టడం కోసం వారు కృషి చేసిన్నట్లు వెల్లడి అయినదని అంటూ చెప్పుకు వచ్చారు.
జాతీయ భద్రత సలహాదారుడు అజిత్ దోవల్ మూడోరోజు రాత్రి ఢిల్లీ వీధులలోకి వచ్చే వరకు పోలీసులు అల్లరి ముఖాలపై కాల్పులకు పాల్పడక పోవడం అందరికి తెలిసిందే. పైగా పోలిసుల నిష్క్రియతా పట్ల పరోక్షంగా స్వయంగా దోవల్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
పైగా తానా ఆ సమయంలో ఢిల్లీలోనే ఉన్నానని, ఢిల్లీ పోలీసులతో సమీక్షలు జరుపుతూనే ఉన్నాను అని చెప్పుకొచ్చారు. మూడు రోజుల తర్వాతనే ఆయన ఢిల్లీ పోలీస్ చీఫ్, ఇతర ఉన్నత అధికారులతో సమావేశం కావడం అందరికి తెలిసిందే.
ఢిల్లీ పోలీసులు స్వయంగా తన అధీనంలో పనిచేస్తున్నా ఒక్క సారి కూడా అల్లర్లు జరిగిన ప్రాంతాలలో పర్యటించక పోవడాన్ని కూడా పోలిసుల దృష్టి మరలకుండా చేయడం కోసం అంటూ సమర్ధించుకున్నారు. బీజేపీ నాయకుల ద్వేష ప్రసంగాలను ప్రస్తావించకుండా గత డిసెంబర్ లో సోనియా గాంధీ చేసిన ప్రసంగాన్ని ఉదహరించారు. ఢిల్లీ పోలీసులకు బిజెపి నేత కపిల్ మిశ్ర అల్టిమేటం ఇచ్చిన తర్వాతనే ఈశాన్య అల్లర్లు ప్రారంభం కావడం అందరికి తెలిసిందే.
కపిల్ మిశ్రతో పాటు ద్వేష ప్రసంగాలు చేసిన ఇతర పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని స్వయంగా ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు మనోస్ తివారి డిమాండ్ చేశారు. పార్టీ ఎంపీ గౌతమ్ గంభీర్ కూడా కోరారు. చివరకు కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, అనురాగ్ ఠాకూర్, యుపి ముఖ్యమంత్రి స్వామి చినయానంద వంటి వారు సహితం అదుపుతప్పి ప్రసంగాలు చేశారు.
తన వైఫల్యాలను కప్పుపుచ్చుకోవడం కోసం నేరమయ ధోరణి ప్రదర్శించిన ఢిల్లీ పోలీసులకు `క్లీన్ చిట్’ ఇవ్వక అమిత్ షా కు తప్పిన్నట్లు లేదు.