https://oktelugu.com/

మెగా కాంపౌండ్లోకి కొత్త హీరోయిన్

నివేథా థామస్ వరుసగా మెగా ఆఫర్లు దక్కించుకుంటుంది. నివేథా థామస్ ‘మెంటల్ మదిలో’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది. సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తో కలిసి ‘చిత్రలహారి’ మూవీలో నటించింది. వీరిద్దరి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. అదేవిధంగా ఇటీవల అల్లు అర్జున్ నటించిన ‘అలవైకుంఠపురములో’ మూవీలో నివేథా థామస్ ఓ కీలక పాత్రలో నటించి మెప్పింది. ‘అలవైకుంఠపురములో’ నివేథా పేతురాజ్ నటనకు ఫిదా అయిన బన్నీ తన తదుపరి మూవీలో ఆమెను హీరోయిన్ గా […]

Written By: , Updated On : March 12, 2020 / 01:28 PM IST
Follow us on

నివేథా థామస్ వరుసగా మెగా ఆఫర్లు దక్కించుకుంటుంది. నివేథా థామస్ ‘మెంటల్ మదిలో’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది. సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తో కలిసి ‘చిత్రలహారి’ మూవీలో నటించింది. వీరిద్దరి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. అదేవిధంగా ఇటీవల అల్లు అర్జున్ నటించిన ‘అలవైకుంఠపురములో’ మూవీలో నివేథా థామస్ ఓ కీలక పాత్రలో నటించి మెప్పింది.

‘అలవైకుంఠపురములో’ నివేథా పేతురాజ్ నటనకు ఫిదా అయిన బన్నీ తన తదుపరి మూవీలో ఆమెను హీరోయిన్ గా తీసుకునేందుకు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సాయిధరమ్ తేజ్ తాజా మూవీ ‘సోలో బ్రతుకే సోబెటర్’ మూవీ తర్వాత మరోసారి ఈ అమ్మడితో కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది. ‘దేవ కట్టా’ మూవీలో సాయిధరమ్ తేజ్ కు జోడీగా నివేథా పేతురాజ్ ఎంపికైనట్లు సమాచారం.

నివేథా పేతురాజ్ ప్రస్తుతం రామ్ ‘రెడ్’ లో నటిస్తుంది. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో నివేథా పేతురాజ్ కు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. బన్నీ, సాయిధరమ్ లను ఒకేసారి మెగా కంపౌండ్లోకి ఎంట్రీ ఇచ్చింది. రామ్ ‘రెడ్’ మూవీ పూర్తయిన తర్వాత మెగా హీరోలతో నటించే అవకాశం ఉంది. నివేథా మెగా ఆఫర్లు దక్కించుకుంటున్న మెగా హీరోయిన్ గా ఎదిగేందుకు ప్రయత్నిస్తుంది. ఈ అమ్మడి లిస్టులో మరిన్ని సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.