Homeజాతీయ వార్తలుAmit Shah: గెలుపు కోసం ఎంతదాకానైనా.. అమిత్ షా కుట్రకోణాన్ని బయటపెట్టిన ప్రఖ్యాత జర్నలిస్టు

Amit Shah: గెలుపు కోసం ఎంతదాకానైనా.. అమిత్ షా కుట్రకోణాన్ని బయటపెట్టిన ప్రఖ్యాత జర్నలిస్టు

Amit Shah: జర్నలిస్టులు ఒకప్పుడు వార్తలను మాత్రమే రాసేవారు. వాటిని మాత్రమే జనంలోకి తీసుకు వెళ్లేవారు. ఇప్పుడేమో వార్తలను మినహా మిగతా అన్నిటిని తీసుకెళ్తున్నారు. సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత వార్తల కంటే సంచలనాలకే జర్నలిస్టులు ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో వీరు వారు అని తేడా లేదు. పైగా మేనేజ్మెంట్లు కూడా రాజకీయ రంగులను ఒంట పట్టించుకోవడంతో అసలు విషయాలు పక్కన పడి.. కేవలం వ్యక్తిగత ఎజెండా మాత్రమే వెలుగులోకి వస్తోంది.. ఈ సందర్భంలో పాత్రికేయులు తమ వ్యక్తిగత అంశాలను కూడా జనాల మీద రుద్దడానికి ఏమాత్రం సంకోశించడం లేదు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. పైగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కేంద్ర హోంశాఖ మంత్రి.. ఆరోపణలు చేసిన వ్యక్తి ఓ పాత్రికేయుడు కావడం విశేషం.

ఓ చానల్లో ఇటీవల ఓ డిబేట్ నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ఓ సీనియర్ జర్నలిస్ట్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇంతవరకు బాగానే ఉంది.. అయితే ఆ సందర్భంగా ప్రేలాపన లాగా అందులో ఒక చర్చ వచ్చింది. ఆ విషయాన్ని కూడా సదరు వ్యాఖ్యాత పేర్కొన్నారు..” ప్రస్తుతం కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా ఒకప్పుడు కాలేజీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయనకు ప్రత్యర్థిగా ఒక మహిళ ఉన్నారు. పైగా ఓటర్లు కూడా ఎక్కువగా మహిళలే ఉన్నారు. ఆ సమయంలో అమిత్ షా గెలవడం దాదాపు అసాధ్యం. అయితే తను గెలవడానికి అమిత్ షా రకరకాల మయోపాయాలు ఉపయోగించారు. చివరికి గెలిచేశారు. ఇప్పుడు మీరు కూడా అలాంటి విధానాలను అనుసరించాలని” ఆ డిబేట్లో పాల్గొన్న ఓ మహిళా రాజకీయ నాయకురాలికి ఆ పాత్రికేయుడు సూచన ఇచ్చాడు. సహజంగా పాత్రికేయులు సమస్యను బయటి ప్రపంచంలోకి తీసుకురావాలి. ఏదైనా తెలియని విషయాన్ని వెలుగులోకి తీసుకురావాలి. అంటే తప్ప ఏదో జరిగిపోయిందని.. ఎవరో వ్యాఖ్యానించారని.. విషయాలను పాత్రికేయులు ప్రస్తావించకూడదు. అన్నింటికీ మించి సొంత భాష్యం చెప్పకూడదు.. విషయాన్ని విషయం లాగా.. వార్తను వార్తలాగా చెప్పగలడమే పాత్రికేయం. అంతేతప్ప పాత్రికేయ ముసుగులో వ్యక్తిగత లక్ష్యాలను.. వ్యక్తులను టార్గెట్ చేసే ప్రయోగాలను చేయకూడదు. అలా చేస్తే పాత్రికేయం అనేది మరుగున పడిపోతుంది.. సంచలనాలకు మాత్రమే పాత్రికేయం కేంద్ర బిందువు అవుతుంది. అప్పుడెప్పుడో అమిత్ షా అలా చేశారని.. అమిత్ షా వ్యక్తిత్వం అలాంటిదని.. ఓ వ్యక్తి చెబితే.. అదే విషయాన్ని ప్రస్తుతం ఈ పాత్రికేయుడు చెప్పడం విశేషం. అందులో నిజం ఎంత? నిజంగానే అమిత్ షా ఆ పని చేశారా? ఆ పని చేస్తే ప్పట్లో ఆయన ఎటువంటి కేసులు ఎదుర్కోలేదా? అనే విషయాలను ఆ పాత్రికేయుడు చెప్పలేదు. అందువల్లే అంటారు పాత్రికేయులు నిజం వైపు మాత్రమే ఉండాలని.. సంచలనం వైపు ఉంటేనే ఇదిగో ఇలాంటి సమస్యలు వస్తాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular