Sandeep Reddy Vanga: 2017లో విడుదలైన “అర్జున్ రెడ్డి” సినిమా టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ ను సృష్టించింది. విజయ్ దేవరకొండ కెరీర్‌ను రాత్రికి రాత్రే మార్చేసిన సినిమా ఇదే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నేటితరం ప్రేమకథకు కొత్త నిర్వచనం ఇచ్చింది. ఈ సినిమా కథలోని ప్రధాన బలమైన అంశం అర్జున్ రెడ్డి పాత్ర స్వభావం. ప్రీతి అనే అమ్మాయిని ప్రేమించి, కుటుంబ కారణాలతో విడిపోయిన తర్వాత తన జీవితాన్ని స్వతంత్రంగా నడిపించడానికి చేసే పోరాటమే ఈ కథ
ఈ సినిమా ముందు వరకు విజయ్ దేవరకొండ చిన్న పాత్రలు చేసినా, “అర్జున్ రెడ్డి” అతన్ని యూత్ ఐకాన్ గా మార్చేసింది. సినిమా మొత్తం విజయ్ బాడీ లాంగ్వేజ్, బోల్డ్ డైలాగ్స్, రా ఎమోషన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఈ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో “రియలిస్టిక్ హీరో” అనే కొత్త కోణాన్ని తీసుకొచ్చిన స్టార్ విజయ్ దేవరకొండ. ఈ సినిమా ఆల్బమ్‌లో అన్ని పాటలు యూత్ ను ఆకట్టుకున్నాయి.
ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా, విజయ్ ఇద్దరు నేషనల్ స్టార్లు అయిపోయారు. అంతే కాకుండా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలిని పాండేకు యూత్ లో ప్రత్యేకమైన క్రేజ్ దక్కింది. సందీప్ రెడ్డి వంగా టేకింగ్ కు మనోళ్లు ఫిదా అయిపోయారు. సందీప్ వంగా కొత్త స్టైల్ రైటింగ్, డైరెక్షన్, విజయ్ దేవరకొండ పవర్‌ఫుల్ నటన,గెటప్, డైలాగ్ డెలివరీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. రొటీన్ సినిమాలకు భిన్నంగా నేచురల్ లవ్, బ్రేకప్ డ్రామాను స్క్రీన్ పై అద్భుతంగా పండించారు.
“అర్జున్ రెడ్డి” సక్సెస్ తర్వాత ఇండియన్ సినిమా మొత్తం దీని స్టోరీని కాపీ చేసేందుకు సిద్ధమైంది. హిందీలో షాహిద్ కపూర్ హీరోగా “కబీర్ సింగ్” పేరుతో సినిమా విడుదలైంది. తమిళంలో “అధిత్య వర్మ” పేరుతో చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ ఈ సినిమా చేశారు. కానీ తెలుగులో సక్సెస్ అయినంతలా అక్కడ హిట్ టాక్ అందుకోలేకపోయింది.
ఈ సినిమాలో ప్రతి సీన్ ను సందీప్ రెడ్డి వంగా చాలా లోతుగా ఆలోచించి రాసుకున్నారు. ఉదాహరణకు సినిమా స్టార్టింగులో విజయ్ నానమ్మ వేసుకునే డ్రస్, సినిమా చివరిలో ప్రీతి వేసుకున్న డ్రస్ రెండూ సేమ్ కలర్ ఉన్నట్లు చూపించారు. ఈ రెండింటిని నిశితంగా పరిశీలిస్తే విజయ్ జీవితంలో ఇద్దరు మహిళలకు చాలా ఇంపార్టెంట్ అన్న సింబాలిక్ గా చూపించారు. విజయ్ దేవరకొండ మేనరిజం, సందీప్ రెడ్డి వంగా నేచురల్ టేకింగ్.. ఇవన్నీ కలిపి అర్జున్ రెడ్డిని “కల్ట్ క్లాసిక్” గా నిలబెట్టాయి.