Amit Shah: మూడు దశాబ్దాల రాజకీయ చరిత్ర.. సొంత కారు కూడా లేని హోం మినిస్టర్‌..!

అమిత్‌షా తనకు రూ.36 కోట్ల స్థిర, చర ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికీ తనకు సొంత కారు లేదని పేర్కొన్నారు. ఆయనకు రూ.20 కోట్ల చర, రూ.16 కోట్ల స్థిర ఆస్తులు ఉన్నాయి.

Written By: Raj Shekar, Updated On : April 20, 2024 1:19 pm

Amit Shah

Follow us on

Amit Shah: దాదాపు మూడు దశాబ్దాల రాజకీయ చరిత్ర.. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన నేపథ్యం.. దేశంలో అత్యంత కీలకమైన హోం మంత్రిగా ఐదేళ్లు ఉన్నారు.. కానీ ఆయనకు సొంత కారు లేదట. ఇప్పటికే అర్థమైంది కదా ఆయనెవరో.. అవును అమిషానే.. తాజాగా ఆయన గుజరాత్‌లోని గాంధీనగర్‌ లోక్‌సభ స్థానంలో శుక్రవారం నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా తన ఎన్నికల అఫిడవిట్‌లో తనకు కారు లేదని పేర్కొన్నారు. ఆస్తుల వివరాలు వెల్లడించారు.

రూ.36 కోట్ల ఆస్తులు..
ఇక అమిత్‌షా తనకు రూ.36 కోట్ల స్థిర, చర ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికీ తనకు సొంత కారు లేదని పేర్కొన్నారు. ఆయనకు రూ.20 కోట్ల చర, రూ.16 కోట్ల స్థిర ఆస్తులు ఉన్నాయి. తన భార్య సోనాల్‌కు రూ.31 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. కేం6ద మంత్రికి రూ.72 లక్షల విలువైన ఆభరణాలు, ఆయన భార్యకు రూ.1.10 కోట్ల విలువైన నగలు ఉన్నాయి. అమిత్‌షా పేరిట రూ.15.77 లక్షల రుణం. సోనాల్‌ పేరిట రూ.26.32 లక్షల రుణం ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు.

వార్షిక ఆదాయం రూ.75.09 లక్షలు..
ఇక హోం మంత్రి అమిత్‌షా తన వార్షిక ఆదాయాన్ని రూ.75.09 లక్షలుగా పేర్కొన్నారు. ఆయన సతీమని వార్షిక ఆదాయం రూ.39.54 లక్షలుగా తెలిపారు. ఎంపీగా అందుకునే వేతనంతోపాటు భూమి, ఇంటి అద్దెలు, వ్యవసాయం, షేర్లు, డివిడెండ్ల నుంచి తనకు ఆదాయం వస్తున్నట్లు వివరించారు. వృత్తిరీత్యా తాను రైతునని, సామాజిక కార్యకర్తనని తెలిపారు.

3 క్రిమినల్‌ కేసులు..
గాంధీనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా రెండోసారి ఆయన పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో దాదాపు 5.57 లక్షల మెజారిటీతో విజయం సాధించారు. ఇక అమిత్‌షా తనపై 3 క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. తాజాగా ఎన్నికల్లో కేంద్ర మంత్రికి పోటీగా కాంగ్రెస్‌ మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు సోనాల్‌ పటేల్‌ను రంగంలోకి దించింది. ఈ స్థానానికి మూడో విడతలో భాగంగా మే 7న పోలింగ్‌ జరుగుతుంది.