Silk Smitha: సినిమా ఇండస్ట్రీలో అప్పట్లో ఐటమ్ గర్ల్ గా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి ‘సిల్క్ స్మిత’..ఇక అందులో భాగంగానే సిల్క్ స్మిత తెలుగు, తమిళ్, మలయాళం లాంటి చాలా భాషల్లో మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకుంది. ఇక స్క్రీన్ మీద తనను చూడగానే యూత్ కుర్రాళ్ళు మొత్తం ఈలలు, గోలలు వేసేవారు.
ఒకానొక సమయంలో ఈమె సినిమాలో ఉంటేనే జనాలు ఆ థియేటర్ కు వచ్చేవాళ్ళు అలాంటి ఒక గొప్ప పేరు ను సంపాదించుకున్న ఏకైక నటి సిల్క్ స్మిత..ఇక ఈమె రజినీకాంత్, చిరంజీవి, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో ఐటమ్ గర్ల్ గా నటించి ఆ సినిమాల సక్సెస్ లో తన వంతు పాత్రనైతే పోషించింది. ఇక ఆమె లాంటి మరో ఐటమ్ గర్ల్ ఇండస్ట్రీకి రాదు, రాలేదు అనేంతలా గుర్తింపు పొందింది. ఒకానొక సమయంలో ఆమె స్టార్ హీరోలతో సంబంధం కూడా చాలా ఎక్కువ రెమ్యూనరేషన్ ను తీసుకునేది. ఇక సిల్క్ స్మిత అప్పట్లో ఏది చేసిన సంచలనంగా నిలిచేది.
15 సంవత్సరాలకే పెళ్లి చేసుకున్న సిల్క్ స్మిత ఇంట్లో అత్తవారి పోరు భరించలేక పారిపోయి మద్రాస్ వచ్చి ఐటెం డాన్సర్ గా మారింది. ఇక ఇదిలా ఉంటే 1984 వ సంవత్సరంలో షూట్ గ్యాప్ లో ఆమె ఆపిల్ తింటూ కూర్చుంది. ఇక షాట్ రెడీ అవడంతో తను సగం తిన్న ఆపిల్ ని టేబుల్ మీద పెట్టి షూట్ కోసం వెళ్ళిపోయింది. ఇక అక్కడే ఉన్న సిల్క్ స్మిత మేకప్ మెన్ ఆ ఆపిల్ ని వేలం వేశాడు.
లొకేషన్ లో ఉన్న వాళ్లే దాన్ని 26 వేల రూపాయలకు కొనుగోలు చేశారు. ఇక మొత్తానికైతే అప్పట్లో ఇదొక ట్రెండ్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఆమె స్టార్ డమ్ ముందు స్టార్ హీరోలు సైతం కొద్ది రోజులపాటు నిలబడలేకపోయారు అనేది మాత్రం వాస్తవం. అంతటి క్రేజ్ ను సంపాదించుకున్న సిల్క్ స్మిత 1996వ సంవత్సరంలో మరణించడం అనేది ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కి తీరని లోటు అనే చెప్పాలి…