Homeఅంతర్జాతీయంIndia- America: అమెరికా బెదిరింపులను భారత్ లెక్కచేయడం లేదా?

India- America: అమెరికా బెదిరింపులను భారత్ లెక్కచేయడం లేదా?

India- America:  రష్యా ఉక్రెయిన్ యుద్దంతో అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తోంది. రష్యాను అదుపు చేసే ఉద్దేశంతో అన్ని దేశాలను తన వైపు తిప్పుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇండియాను కూడా తన గుప్పిట్లో పెట్టుకోవాలని భావిస్తోంది. కానీ భారత్ మాత్రం అమెరికా చర్యలను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో ఇండియాపై అక్కసు వెళ్లగక్కుతోంది. భవిష్యత్ లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరికలు జారీ చేస్తోంది. అయినా ఇండియా మాత్రం తన పట్టు జారనివ్వడం లేదు. ఉక్రెయిన్ కు మద్దతు తెలపాలని డిమాండ్ చేసినా లెక్కచేయడం లేదు.

India- America
India- America

రష్యా భారత్ కు చిరకాల మిత్ర దేశం అనడంలో సందేహం లేదు. 1971లో పాకిస్తాన్ యుద్ధ సమయంలో ప్రపంచంలోని 18 దేశాలు భారత్ పైకి ఎదురుదాడికి దిగినప్పుడు రష్యా వాటిని అదుపు చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఎప్పుడైనా ఆపదలు వచ్చే సమయంలో రష్యా మనకు సాయం చేస్తూనే ఉంటుంది. అలాంటి దేశానికి వ్యతిరేకంగా మనం వ్యవహరిస్తే బాగుండదనే ఉద్దేశంతో రష్యాకు వ్యతిరేకంగా భారత్ వ్యవహరించడం లేదు.

అలాగని చైనా దురాక్రమణ చేస్తే రష్యా మద్దతిస్తుందా? అని అమెరికా వేసిన ప్రశ్నకు ఔననే సంకేతాలు ఇస్తోంది. ఎప్పుడైనా భారత్ కు ఆపద వస్తే ఖచ్చితంగా రష్యా తన వంతు సాయం చేస్తుందనేది నిర్వివాదాంశమే. అందుకే అమెరికా ఆంక్షలను సైతం భారత్ తిప్పికొడుతోంది. రష్యా విషయంలో ఎవరెన్ని చెప్పినా పట్టించుకోవడం లేదు. అందుకే అమెరికా ఒంటికాలిపై లేస్తోంది. భారత్ ను ఇరుకున పెట్టాలని ప్రయత్నాలు చేస్తోంది.

అంతర్జాతీయంగా వస్తున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని భారత్ తన అవసరాలను తీర్చుకోవడానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే శ్రీలంక సంక్షోభంలో కూరుకుపోగా ఏ దేశం కూడా దానికి సాయం చేయడం లేదు. అలాంటి పరిస్థితులు వస్తే భారత్ కు వెన్నుదన్నుగా నిలిచేది మాత్రం రష్యానే. దీంతోనే రష్యాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదురు చెప్పకుండా తటస్థంగా వ్యవహరిస్తోంది. అలాగని ఉక్రెయిన్ పై యుద్ధం చేయమని కూడా చెప్పడం లేదు.

India- America
India- America

అసలు భారత్ పై అమెరికా ఎందుకు దృష్టి సారిస్తోంది. యుద్ధం విషయంలో భారత్ నే ఎందుకు నిందిస్తోంది. రష్యా తన సైనిక చర్య ద్వారా ఉక్రెయిన్ ను దారికి తీసుకురావాలని చూస్తోంది. దానిపై ఆంక్షలు విధించి తన వంతు పాత్ర పోషిస్తున్నా ఇండియాపై ఎందుకు కక్ష పెంచుకుంటోంది. రష్యాతో భారత్ కు ఉన్న సంబంధం నేపథ్యంలోనే అమెరికా ఇండియాను నిందిస్తోంది. రష్యా చర్యలను ఖండించాలని పట్టుపడుతోంది. దీనికి మనదేశం మాత్రం ససేమిరా అంటోంది.

అమెరికా తీరుపై పాకిస్తాన్ కూడా మండిపడుతోంది. ఈమేరకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా చర్యలను ఖండిస్తున్నారు. భారత్ వైఖరిని ప్రశంసిస్తున్నారు. భారత్ లాంటి దేశం అమెరికా మాట వినకుండా రష్యాతో మైత్రి కొనసాగించడం మంచిదే అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ఉద్దేశాలను తప్పుబట్టారు. ఇండియా వైఖరికి ఓటు వేస్తున్నారు. దీంతో అమెరికా చర్యలను ఇండియా మాత్రం లెక్కపెట్టడం లేదు. దీనిపై భవిష్యత్ లో కష్టాలు తప్పవని అగ్రరాజ్యం హెచ్చరికలు జారీ చేయడం విశేషం.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

1 COMMENT

  1. […] Gram Panchayat AP: పండుగల నాడు ప్రభుత్వాలు వరాలు ప్రకటిస్తాయి. సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడతాయి. ప్రజోపయోగ పనులు చేపడతాయి. కానీ అందుకు జగన్ సర్కారు మాత్రం. తెలుగు ప్రజల తొలి పండుగ నాడే ఝలక్ ఇచ్చింది. ఆర్థిక సంవత్సరం తొలి రోజునే పంచాయతీలకు తేరుకోలని షాక్ ఇచ్చింది. ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కేందుకు పంచాయతీల సొమ్ముపై కన్నేసింది. పంచాయతీలు పన్నుల రూపంలో వసూలు చేసుకున్న మొత్తాలను కూడా తీసేసుకుంది. గత ఏడాది డిసెంబరులో రూ.7660 కోట్ల ఆర్థిక సంఘం నిధులను సొంత ఖాతాకు మళ్లించిన సంగతి తెలిసిందే. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular