
అనైతికంగా.. రాజ్యాంగానికి విరుద్ధంగా ట్రంప్ వలసలపై నిషేధం విధించారు. తద్వారా నిపుణులు, మేధావులైన ఇతర దేశాల వారికి అమెరికాలోకి తలుపులు మూసేశారు. నిజానికి అమెరికా ఇప్పుడు అగ్రరాజ్యంగా ఎదగడానికి మెరుగైన నాణ్యమైన.. చీప్ గా దొరికి విదేశీ నిపుణులే కారణం.. వారంతా కష్టపడి అమెరికా అభివృద్ధిలో పాలుపంచుకున్నారు. ఇప్పుడు అమెరికా టెక్నాలజీలో నంబర్ 1గా నిలవడానికి విదేశీ నిపుణుల పాత్ర ఎంతో ఉంది.
Also Read: ట్రంప్ త్వరగా కోలుకోవాలి: ప్రధాని మోదీ
అంతదాకా ఎందుకు.. ప్రపంచంలోనే టెక్నాలజీ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్ ను నడిపిస్తున్నది మన భారతీయులే. దీన్ని బట్టి వలసలు అమెరికాకు ఎంత మేలు చేశాయో అర్థమవుతోంది. అయితే ఈ జూన్ లో హెచ్1బీ వీసాలపై ట్రంప్ నిషేధాన్ని విధించారు. ఐటీ, ఇతర సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. సంక్షోభ సమయంలో వీసాలపై నిషేధం విధించడం వల్ల ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారుతోందని నైపుణ్యం ఉన్న వారు దొరకడం కష్టమని పలువురు తాజాగా కోర్టును ఆశ్రయించారు.
వీసాలపై ట్రంప్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అమెరికా ఉత్పత్తిదారుల జాతీయ సమాఖ్య, యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్, జాతీయ రిటైల్ ఫెడరేషన్, టెక్ నెట్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశాయి. ఇందులో వాణిజ్య విభాగం, హోమ్ లాండ్ సెక్యూరిటీలను ప్రతివాదులుగా పేర్కొన్నాయి. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, అభివృద్ధి, ఆవిష్కరణల్లో కీలకమైన నిపుణుల నియామకాలను నిరోధించే వీసా నిషేధంపై ఈ తీర్పు తక్షణమే అమల్లోకి వస్తుందని నేషనల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ పేర్కొంది. మా పరిశ్రమలో ఆవిష్కరణలకు తోడ్పడే అగ్రశ్రేణి ప్రతిభావంతులను గుర్తించి అభివృద్ధి చేయడానికి మిగతా ప్రపంచంతో పోటీపడుతున్నామన్నారు.దీంతో వాదనలు విన్న కోర్టు హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ ఉత్తర్వులను రద్దు చేస్తూ నార్తర్న్ కాలిఫోర్నియా జిల్లా న్యాయమూర్తి జస్టిస్ జెఫ్రీ వైట్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఇది తయారీదారులకు తాత్కాలిక విజయంగా పిటీషన్ దారులు పేర్కొన్నారు.
Also Read: ట్రంప్ దంపతులకు కరోనా పాజిటివ్..
అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్ విసిరిన పాచికకు కోర్టు బ్రేకులు వేసింది. ఈ ఏడాది జూన్ లో అమెరికన్ల ఓట్లు కొల్లగొట్టేందుకు హెచ్1 బీ వీసాలపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులను కాలిఫోర్నియా న్యాయస్థానం కొట్టివేసింది. ఆయన చర్యలు రాజ్యాంగ అధికార పరిధిని మించిపోయాయని ఈ సందర్భంగా కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇమ్మిగ్రేషన్ విధానాన్ని నిర్ణయించే అధికారం రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్ కు ఉందని.. అధ్యక్షుడికి లేదని కోర్టు స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.