West Bengal : అవసరం, కష్టాలు ఎదురైన్పుడు మనిషి మెదడు చురుకుగా పనిచేస్తుంది. అత్యవసర సమయంలో పరిష్కారం మార్గం కోసం అన్వేషిస్తుంది. ఇలా అనేక మంది తమ అవసరం, ఆలోచనతో అనేక సమస్యలు పరిష్కరించుకుంటున్నారు. ఇలాంటి ఆలోచనలతో ఆవిష్కృతమైనవి కొన్ని అందరికీ ఉపయోగపడుతున్నాయి. సమాజ శ్రేయస్సుకు దోహదం చేస్తున్నాయి. కోల్‌కతాకు చెందిన కార్మికుడు కరీముల్ హక్ కూడా తన తల్లి మరణంతో స్ఫూర్తి పొందాడు. తన తల్లిలా ఇక ఏ తల్లి మరణించొద్దని భావించాడు. ఈమేరకు అతని సంకల్పంతో.. ఆద్భుతం ఆవిష్కృతమైంది. వేల మంది ప్రాణాలు నిలబడుతున్నాయి. కరీముల్ హక్ 1998లో తన తల్లిని కోల్పోయాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ లేకపోవడంతో తల్లిని కోల్పోయాడు. తల్లి మరణం తర్వాత చికిత్స అందక ఇక ఎవరూ చనిపోకూడదని ప్రతిజ్ఞ చేశాడు. తన మోటార్‌బైక్‌ను అంబులెన్స్‌గా మార్చాడు. అందులోనే రోగులను, అత్యవసర వైద్యం అవసరమైన వారిని ఆస్పత్రికి తరలించడం ప్రారంభించారు. ఇలా ఏడు వేలకుపైగా ప్రాణాలను కాపాడారు.
ఎగతాళి చేసినా…
పశ్చిమబెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లాకు చెందిన కరీముల్ హక్ తన బైక్‌ను అంబులెన్స్ మార్చినప్పుడు చాలా మంది నవ్వారు. ఎగతాళి చేశారు. కానీ, కరీముల్ హక్ తన ప్రయత్నం ఆపలేదు. కొన్ని రోజుల తర్వాత అందరి ఆలోచన మారింది. ఆయన ప్రజలకు చేస్తున్న సేవలను చూసి ఆశ్చర్యపోయారు. ఇలా ఏడువేల మందిని ఆస్పత్రులకు తలరించి ప్రాణాలు కాపాడరు. తర్వాత కరీముల్ ప్రాథమిక వైద్యం అందించడంతో శిక్షణ పొందాడు. తన కుమారుకు కూడా ప్రథమి చికిత్సలో శిక్షణ ఇప్పించారు. అంబులెన్స్‌తోపాటు, గ్రామంలో వైద్య శిబిరాలు న్విహిస్తూ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇక తన సొంత భూమిలోనే కొంత భాగాన్ని ఆస్పత్రిగా మార్చాడు.
వరించిన పద్మశ్రీ..
24/7 అంబులెన్స్ సేవలు అందిస్తున్న కరీముల్ హక్ కృషికి ఫలితం కూడా దక్కింది. అతని సేవలకు కేంద్రం 2017లోనే పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 20 ఏళ్లుగా ఆయన చేసిన సేవలకు దక్కిన గౌరవమిది. అవార్డు అందుకుంటున్న సమయంలో తన వయసు 55 ఏళ్లని, తన శరీరంలో సత్తువ ఉన్నంత వరకు అంబులెన్స్ సేవలు కొనసాగిస్తానని ప్రకటించారు.