https://oktelugu.com/

CM Revanth Reddy : నేను సిఎం గా ఉన్నన్ని రోజుల బెన్ ఫిట్ షో లకు పర్మిషన్ లేదు : రేవంత్ రెడ్డి

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు తమకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 21, 2024 / 03:55 PM IST

    CM Revanth Reddy

    Follow us on

    CM Revanth Reddy : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు తమకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న మనవాళ్లు బాలీవుడ్ హీరోలను సైతం బీట్ చేస్తూ భారీ కలెక్షన్లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే… ఇకమీదట తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని అనూహ్యమైన మార్పులు కూడా రాబోతున్నట్టుగా తెలుస్తోంది…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. ఇక స్టార్ హీరోలు సైతం ఇప్పుడు ఎనలేని ఇమేజ్ ను సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంతో వాళ్ల సినిమాలకు భారీ క్రేజ్ ను క్రియేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే పుష్ప 2 సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తూ ముందుకు సాగుతుంది. ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట లో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ విషయం మీద గత 15 రోజుల నుంచి తీవ్రమైన చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఇక మీదట నుంచి ఏ సినిమాలకు బెనిఫిట్ షోస్ కి అవకాశం ఇచ్చేది లేదు అంటూ తను సీఎంగా ఉన్నాన్ని రోజులు ఇదే పద్ధతిని పాటిస్తానని ఘాటుగా సమాధానం చెప్పాడు. ఇక హీరోలు వాళ్ళ సినిమాల విషయంలో భారీగా మార్కెట్ చేసుకొని భారీగా డబ్బులను సంపాదించుకుంటున్నారు. కానీ పేద ప్రజలకు అభిమానుల విషయంలో మాత్రం చాలా చులకన భావాన్ని చూపిస్తున్నారు. వాళ్లు కూడా భారీ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

    తద్వారా ఈ బెనిఫిట్ షోస్ ఎందుకోసం వెయ్యాలి అంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఇక మొత్తానికైతే ఇక మీదట బెనిఫిట్ షోస్ అనేవి ఉండవు ఇక స్టార్ హీరోల సినిమాల మీద కొంతవరకు దెబ్బ పడే అవకాశాలైతే ఉన్నాయి.

    ఇక కలెక్షన్ల విషయంలో పెద్ద హీరోల సినిమాలకు ఇది కొంతవరకు మైనస్ గా మారే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తోంది… ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట ఫ్యాన్స్ కూడా బెనిఫిట్ షోస్ కోసం ఎదురు చూడాల్సిన అవసరమైతే లేదు. ఎందుకంటే ప్రాణాలను చెలగాటంగా పెట్టుకొని సినిమాలను చూడాల్సిన పరిస్థితి లేదు.

    ఏ ఒక్కరి ప్రాణం పోయినా కూడా వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్డుమీద పడిపోయే పరిస్థితిలు ఉన్న ఈ రోజుల్లో ఏ హీరో కోసమైతే మనం సినిమాలను చూస్తున్నామో ఆ హీరో వచ్చి తమ కుటుంబాన్ని కాపాడుతాడా లేదు కదా అందుకే సీఎం ఇలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నట్టుగా పలువురు నెటిజన్లు సైతం ఈ నిర్ణయం మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ప్రాణాల కంటే ఎక్కువ ఏది లేదు. కాబట్టి ఈ నిర్ణయాన్ని మనం తప్పకుండా ఫాలో అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది…